Bajaj Pulsar NS400Z Review Video బజాజ్ పల్సర్ NS400Z ఫుల్ రివ్యూ వీడియో
బజాజ్ పల్సర్ NS400Z తాజాగా భారతీయమ మార్కెట్‌లో విడుదలైంది. సరికొత్త డిజైన్‌లో ఈ బైక్‌ని సంస్థ తీసుకువచ్చింది. NS లైనప్ మాదిరిగానే ఈ బైక్ డిజైన్ ఉన్నప్పటికీ కొత్తగా మెరిసే LED DRLలు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ సెటప్‌కు ఇరువైపులా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ బైక్ యూత్‌ని ఎక్కువగా ఆకట్టుకోనుంది.
373.3cc సింగిల్-సిలిండర్ యూనిట్‌తో ఈ బైక్ ఇంజిన్ పనిచేస్తుంది. ఈ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ 8,800rpm వద్ద 39.45 bhp పవర్‌ని ఉత్పత్తి చేయగలదు. అలాగే 6,500rpm వద్ద 35Nm గరిష్ట టార్క్ ఉత్పత్తితో పాటు 9,500 rpm వరకు ఉత్పత్తి చేస్తుంది. ఇతర పల్సర్ బైక్‌లతో పోల్చితే ఇది చాలా శక్తివంతమైన ఇంజిన్‌ని కలిగి ఉంది.
ఈ బైక్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంది. ఈ కొత్త NS400Z నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి రోడ్, రైన్, స్పోర్ట్ మరియు ఆఫ్‌రోడ్ మోడ్‌లుగా ఉన్నాయి. కొత్త NS400Z యొక్క ఫ్రేమ్ ముందువైపు 43 USD ఫోర్క్స్ వెనుకవైపు 6-దశల ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్‌తో జతచేయబడి ఉంటుంది.
శక్తివంతమైన ఇంజిన్‌తో లాంచ్ అయిన ఈ బైక్.. యూత్‌కు స్పోర్ట్ బైక్ మాదిరిగా ఫేవరెట్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. పల్సర్ లవర్స్ ఊహించిన విధంగా ఈ బైక్ మంచి అనుభూతిని అందించనుంది. ఈ బైక్‌ని మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్ రైడ్ నిర్వహించింది. దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ వీడియో మీకోసం



Click it and Unblock the Notifications








