పల్సర్ ప్రియులకు ఇక పండగే.. సరికొత్త NS400 సిరీస్ నుంచి మోస్ట్ అడ్వాన్స్‌డ్ బైక్ లాంచ్
బజాజ్ సంస్థ పల్సర్ NS400 సిరీస్‌లో పవర్‌ఫుల్ బైక్‌ని విడుదల చేసింది. పల్సర్ సిరీస్‌లోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫర్ఫామెన్స్ కలిగిన బైక్‌ని బజాజ్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. NS400Z పేరుతో తొలి బైక్‌ని నేడు లాంచ్ చేసింది. త్వరలోనే ఈ సిరీస్‌లో మరికొన్ని వేరియంట్లను సంస్థ విడుదల చేయనుంది.
ఇంజిన్: 373cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ బైక్ పనిచేస్తుంది. 8800rpm వద్ద 40 PS మరియు 6500rpm వద్ద 35 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ మరియు స్పోర్ట్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఈ సరికొత్త బైక్‌లో గమనించవచ్చు.

ఫీచర్లు: NS400లో ఫుల్ అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా డాట్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేతో అధునాతన కలర్ స్కీమ్‌లతో కూడిన పూర్తి-డిజిటల్ ఇంట్రుమెంట్ ప్యానెల్‌ని గమనించవచ్చు. ఈ బైక్‌ని బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ బైక్‌ని పూర్తిగా నేవిగేట్ చేయవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ మరియు టెక్స్ట్ అలర్ట్‌లు, మ్యూజిక్ కంట్రోల్, ల్యాప్ టైమర్‌ని కంట్రోల్ చేయవచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది.
ఈ బైక్ మొత్తం నాలుగు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. అవి బ్లాక్, మెటాలిక్ పర్ల్ వైట్, కాక్‌టెయిల్ వైన్ రెడ్ మరియు ప్యూటర్ గ్రే కలర్లలో రానున్నాయి. ఈ బైక్ ఫ్రంట్ ఫేసియా (ముందు భాగం) డిజైన్‌కి సరికొత్తగా మార్పు చేసింది. అచ్చం స్పోర్టీ లుక్‌ని కలిగి ఉన్న బైక్‌లా దీనిని బజాజ్ డిజైన్ చేసింది.
ఫ్రంట్‌లో సింగిల్-పాడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ కస్టమర్లను కచ్చితంగా ఆకట్టుకోనుంది. హెడ్‌ల్యాంప్‌కి రెండు వైపులా ఉన్న LED DRLలు బైక్‌ని మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. LED హెడ్‌లైట్లు, LED టైల్‌లైట్లు, LED బ్లింకర్లు లైట్లు ఉన్నాయి. సరికొత్త డిజైన్ మరియు స్పోర్టీ లుక్ కలిగి ఉన్న ఈ బైక్ యూత్‌ని అమితంగా ఆకట్టుకోనుంది.
బజాజ్ పల్సర్ 150, పల్సర్ 125, పల్సర్ 220F మొదలైన లైనప్‌లకు అప్‌డేటెడ్‌గా పల్సర్ N160, N150 మరియు N250లను తీసుకువచ్చింది. స్పోర్టియస్ట్ లుక్‌లో పల్సర్ NS125, NS160 మరియు NS200లకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తాజాగా 400cc పల్సర్ బైక్ లవర్స్‌ని మరింతగా ఆకట్టుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రత్యర్థి బైక్స్: బజాజ్ పల్సర్ NS400Z ధరను రూ. 1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) సంస్థ నిర్ణయించింది. ఈ బైక్‌కి బజాజ్ డామినార్ 400, KTM Duke 390, హస్క్‌వర్నా స్వార్ట్‌పిలెన్ 401 బైక్‌లు ప్రత్యర్థి బైక్స్‌గా ఉన్నాయి. ఈ బైక్ ధరలు వరుసగా రూ. 2.31 లక్షలు, రూ. 3.10 లక్షలు, రూ. 2.92 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరలుగా ఉన్నాయి.
ఈ బైక్‌ని బుకింగ్ చేయాలనుకునే కస్టమర్లు సమీపంలోని డీలర్స్ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో రూ. 5000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ ఇప్పటివరకూ విడుదలైన బైక్స్‌తో పోల్చితే మోస్ట్ అడ్వాన్స్‌డ్ పల్సర్‌గా సంస్థ తెలిపింది. ఒక్కసారి మార్కెట్‌లోకి విడుదల అయ్యాక ఈ బైక్ సత్తా చాటుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








