హవ్వ!.. ఇలా కూడా ఎవరైనా చేస్తారా?: నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఎన్నెన్నో సంఘటనలు కనిపించాయి. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన మాత్రం వామ్మో! అనిపించేలా ఉంది. ఇంతకీ ఏంటా ఘటన? ఎక్కడ జరిగింది? ట్రాఫిక్ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.
వాట్ నౌ మీడియా.. అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే, ఒక వ్యక్తి స్కూటర్ రైడ్ చేస్తున్నారు. వెనుక ఒక మహిళ కూర్చుని ఉంది. ఆ మహిళ ఒక పిల్లాన్ని పట్టుకుని ఉంది. మహిళ పిల్లాన్ని పట్టుకున్న తీరు చూస్తే ఎవరైనా ఒక్కసారిగా అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే.. ఆ మహిళ బాలుడిని స్కూటర్ సీటు మీద కాకూండా, ఫుట్ రెస్ట్ మీద నిలబెట్టి పట్టుకుంది.

ఈ సంఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి స్కూటర్ రైడ్ చేసే వ్యక్తి అనుకోకుండా పట్టు తప్పితే.. ఏం జరుగుతుందో ఊహాతీతమనే చెప్పాలి. అనుకోని ప్రమాదం జరిగితే ఆ పిల్లవాడికి ప్రమాదం జరుగుతుంది. ఫుట్ రెస్ట్ మీద నిలబడిన బాలుడు కాలు జారీ కూడా కిందపడే ప్రమాదం ఉంది. ఇలా ఆ బాలుడికి ఏమైన జరగవచ్చు. ఇది ప్రమాద హేతువు అని చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది.
బెంగళూరులో పోలీసులు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ సంఘటనకు కారణమైన వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాము. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన చాలామంది మీద పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఇక్కడ కనిపించే వీడియోలో ఆ మహిళ చేసింది మాత్రం ఆమోదయోగ్యం కాదు. కాబట్టి తప్పకుండా వారికి తగిన గుణపాఠం చెప్పి.. అలంటి చర్యలకు మళ్ళీ పాల్పడకుండా ఉండేలా చూడాలి.

రోడ్డు మీద అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణిస్తేనే.. ప్రమాదాలు కోకొల్లలుగా జరుగుతాయి. అలాంటిది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. ప్రమాదం జరిగితే ఏమవుతుందో అని ఊహించకుండా మహిళ పిల్లవాణ్ణి ఫుట్ రెస్ట్ మీద నిలబెట్టింది. అంతే కాకుండా వారు హెల్మెట్ కూడా ధరించలేదు. అయితే రైడర్ హెల్మెట్ ధరించారా? లేదా? అనేది తెలియదు. బహుశా రైడర్ హెల్మెట్ ధరించి ఉన్నారని భావిస్తున్నాము.
బెంగళూరు నగరంలో బైకు మీద ప్రయాణించేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. లేకుంటే భారీ జరిమానాలు విధిస్తారు. కేవలం రైడర్ మాత్రమే కాకుండా పిలియన్ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించి ఉండాలి. బెంగళూరు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరి నిర్లక్ష్య ధోరణి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. లేకుంటే ఇలాంటి వారిని ఇతరులు ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది.

నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో చూసిన చాలామంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులు చేసేపనులు చూసి త్వరగా నేర్చుకుంటారు, అని కొందరు పేర్కొన్నారు. మరి కొందరు ఆ పిల్లవాడే కావాలని తల్లిదండ్రులను అడిగి ఆలా ఫుట్ రెస్ట్ మీద నిలబడి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆ పిల్లవాణ్ణి అక్కడ నిలబెట్టడం మాత్రం ప్రమాదం.
గతంలో వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనల్లో కొంతమంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను కారు యొక్క సన్‌రూఫ్ నుంచి బయటకు రావడానికి అనుమతిచ్చారు. ఇది కూడా అత్యంత ప్రమాదం. ఎందుకంటే అనుకోకుండా ఎక్కడైనా స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు లేదా సడన్ బ్రేక్ వేసినప్పుడు, వారు ముందుకు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలను కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించకూడదు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








