మీ ఇంటి ఆడపడుచులకు ఈ స్కూటర్లను గిఫ్ట్‌గా ఇవ్వండి.. ధర చాలా తక్కువ!!

రోజువారీ వినియోగంలో బైక్స్‌ అనేవి సాధారణం అయ్యాయి. ప్రతీ ఇంట్లో ఇప్పుడు టూ-వీలర్‌ అనేది భాగం అయ్యింది. ముఖ్యంగా లేడీస్‌ ఎక్కువగా మోటారు సైకిళ్ల కంటే స్కూటర్లను డ్రైవ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంట్లో రోజువారి అవసరాలతో పాటు మార్కెట్‌కి, షాపింగ్‌కి, పిల్లలను బడికి పంపేందుకు స్కూటర్లు ఉపయోగపడతాయి. మగవారు ఇంట్లో లేని సమయంలో మహిళలు బయటకు వెళ్లేందుకు ఈ స్కూటర్లు పనికి వస్తాయి. అందుకే ఎక్కువగా మహిళలు ఎక్కువగా వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ కంపెనీలు నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ 5 స్కూటర్లు..

ఈ జాబితాలో ముందుగా హోండా యాక్టివా 6జీ స్కూటర్ ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.78,174 నుంచి రూ.84,674 మధ్య ఉంది. ఇందులోని 109.51 CC సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ ఇంజిన్‌ గరిష్టంగా 7.8 PS శక్తిని మరియు 8.9 NM గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Best-Scooters-In-India-For-Women-Honda-Activa

ఈ స్కూటర్‌ లీటరుకు 55.9 నుండి 59.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో LED హెడ్ ల్యాంప్స్, అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌ కలిగి ఉంది. 105 కిలోల బరువున్న ఈ స్కూటర్ 5.3 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్, 162 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది.

ఆ తర్వాత జాబితాలో హీరో ప్లెజర్ ప్లస్ తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ.72,163 నుంచి రూ.83,918 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇందులోని 110.9 CC పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 8.1 PS శక్తిని మరియు 8.7 NM గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

Hero-Pleasure-Plus-Price

ఇందులోనూ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రోమ్ రియర్ వ్యూ అద్దాలు, LCD స్క్రీన్ వంటి ఫీచర్లు కొత్త హీరో ప్లెజర్ ప్లస్‌లో ఉన్నాయి. డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌ కూడా ఉంది. 106 కిలోల బరువున్న ఈ స్కూటర్ 4.8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ని కలిగి ఉంది. మంచి కంపెనీ స్కూటర్‌ తక్కువ బరుకు కలిగి ఉన్న స్కూటర్‌ని నిరభ్యరంతంగా కొనుగోలు చేయవచ్చు.

ఇక ఆ తర్వాత జాబితాలో టీవీఎస్ జూపిటర్ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .77,121 నుండి రూ .92,201 మధ్య ఉంది. ఇందులోని 109.7 సీసీ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 7.9 పిఎస్ శక్తిని, 8.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 52 నుండి 64 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.

TVS-Jupiter-Price

ఆ తర్వాత జాబితాలో హీరో జూమ్ ఉంది. ధర రూ .75,761 నుంచి రూ .84,400 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇందులోని 110.9 సీసీ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 8.15 పిఎస్ శక్తిని 8.70 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 45 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌తో పాటు ఇతర అనేక ఫీచర్లు ఉన్నాయి.

చివరగా హోండా డియో ఈ జాబితాలో ఉంది. ఈ స్కూటర్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ .74,629 నుంచి రూ .82,130 మధ్య ఉంది. ఇందులోని 109.51 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 7.85 పిఎస్ శక్తిని, 9.03 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 28, 2024, 19:26 [IST]
English summary
Best 110 cc scooters suaitable for womens price and features details in telugu
Read more on: #auto news #scooter #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+