ఎంచుకో ఓ మంచి బైక్!.. ధర రూ.2.5 లక్షల కంటే తక్కువే..
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో ఖరీదైనవి ఉన్నాయి, సరసమైన బైకులు ఉన్నాయి. ఈ కథనంలో రూ. 2.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం..
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 (TVS Apache RTR 310)
రూ.2.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ బైకులలో ఒకటి టీవీఎస్ కంపెనీకి చెందిన 'ఆర్‌టీఆర్ 310'. ఈ బైక్ ధర రూ.2.42 లక్షలు (ఎక్స్-షోరూమ్). మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 312.2సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9700 rpm వద్ద 356Bhp పవర్, 6650 rpm వద్ద 28.7Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హోండా సీబీ300 ఆర్ (Honda CB300 R)
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా మోటార్‌సైకిల్ ఇండియా యొక్క 'సీబీ300 ఆర్' కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. దీని ధర రూ. 2.40 లక్షలు (ఎక్స్ షోరూమ్). 286 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 31.14 Bhp పవర్ మరియు 27.5 Nm టార్క్ అందిస్తుంది. ఇండ్జిం 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
కేటీఎమ్ అడ్వెంచర్ 250 (KTM Adventure 250)
ఎక్కువమంది యువ రైడర్లకు ఇష్టమైన బైక్ మరియు రూ. 2.5 లక్షల కంటే తక్కువ ధరకే లభించే బైకులలో ఒకటి కేటీఎమ్ కంపెనీకి చెందిన అడ్వెంచర్ 250. దీని ధర రూ. 2.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడగానే ఆకర్షించబడే డిజైన్ కలిగిన ఈ బైక్ వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండే అనేక అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ రైడర్‌కు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

కేటీఎమ్ అడ్వెంచర్ 250 బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 30 Bhp పవర్ మరియు 24 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. స్మూత్ రైడింగ్ కోసం ఈ బైక్ పవర్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ సౌకర్యాన్ని పొందుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350)
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన 'మీటియోర్ 350' ధర రూ. 2.03 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది జే సిరీస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు శక్తినిచ్చే అదే 349.34 సీసీ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6100 rpm వద్ద 19.94 Bhp పవర్ మరియు 4000 rpm వద్ద 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

యమహా ఆర్15 (Yamaha R15)
యమహా కంపెనీకి చెందిన ఆర్15 కూడా రూ. 2.5 లక్షల కంటే తక్కువ ధరకు లభించే ఉత్తమమైన బైకులలో ఒకటి. దీని ధర రూ. 1.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ఉత్తమ పనితీరుని అందిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








