రూ. 70 వేలకే 70 కి.మీ మైలేజీ ఇచ్చే బైక్స్.. డెలివరీ బాయ్స్, డైలీ యూజర్స్‌కి ది బెస్ట్!
దేశంలో జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా టూవీలర్స్ వినియోగం కూడా పెరుగుతూ వస్తుంది. ప్రతీ ఇంట్లో టూ-వీలర్ అనే ట్రెండ్ దేశంలో మొదలైంది. అందువల్ల టూ-వీలర్స్‌ని కొనేవారి సంఖ్య అధికం అవుతుంది. అయితే దేశంలో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. రోజువారి పనుల కోసం ప్రతి ఒక్కరూ నేడు టూ-వీలర్స్‌పై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వందల సంఖ్యలో టూవీలర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ మోటార్ సైకిల్ సరసమైన ధరలో లభిస్తుంది? ఎంత మైలేజీ వస్తుందనే విషయం కాస్త అయోమయానికి గురిచేస్తుంది. అయితే రూ.70,000 (ఎక్స్-షోరూమ్)లకే మంచి మైలేజీ ఇచ్చే బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో..
హోండా షైన్ 100: ఈ బైక్ 98.98 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7.38 ps శక్తిని మరియు 8.05 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్‌ని పొందుతుంది. ఇది లీటర్‌కి 68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బైక్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ గోల్డ్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సేఫ్టీ దృష్ట్యా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది అతి వేగంలోనూ బైక్‌ని క్షణాల్లో ఆగిపోయేలా చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 65,143 గా ఉంది.
టీవీఎస్ స్పోర్ట్: ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది గరిష్టంగా 8.19 ps శక్తిని మరియు 8.7 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్‌గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

ఇందులో అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ ప్యానెల్, బల్బ్ స్టైల్ హెడ్‌లైట్, LED DRL, సెల్ఫ్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ 112 కిలోల బరువు ఉంటుంది. ఈ బైక్‌లో 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఈ బైక్‌ని రూ.67,320 నుంచి రూ.72,033 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
బజాజ్ ప్లాటినా 100: ఈ బైక్ 102 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7.9 ps శక్తిని మరియు 8.3 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్‌గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ సరికొత్త బజాజ్ ప్లాటినా 100 లీటర్‌కి లీటర్ కు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

ఇది బ్లాక్ & రెడ్, బ్లాక్ & సిల్వర్, బ్లాక్ & గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. 117 కిలోమీటర్లు ఉన్న ఈ బైక్ 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఇందులో హాలోజెన్ హెడ్‌లైట్, సింగిల్ పీస్ సీట్, అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ రూ . 68,742 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications