సుజుకి స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. బడ్జెట్ ధరలో, అధిక మైలేజ్ అందించే ది బెస్ట్ స్కూటర్లు ఇవే.!!
ఈ రోజుల్లో అనుకున్న పనులు సమయానికి పూర్తవ్వాలంటే సొంత వాహనం తప్పనిసరి. అందుకే రోజువారీ అవసరాలకు ఎక్కువగా ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తుంటారు. మహిళలు ఇంకా మోటార్ సైకిళ్లను నడపలేని వారు స్కూటర్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో మీరు మంచి స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ సుజుకి టూ వీలర్ల వివరాలు అందిస్తున్నాం.
భారత మార్కెట్లో టూ వీలర్ విభాగంలో హోండా, టీవీఎస్, సుజుకి, బజాజ్ కంపెనీల స్కూటర్లు అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్నాయి. సరసమైన ధరలో అధిక మైలేజ్, అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులో ఉండటంతో ప్రజలు వీటిపై మొగ్గు చూపుతున్నారు. కాగా ఇక్కడ మీరు రోజువారీ అవసరాల కోసం కొత్త స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే సుజుకి మీకు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

బడ్జెట్ ధరలో, అధిక మైలేజ్‌తో సుజుకి స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా సుజుకి స్పోర్ట్స్ బైక్‌లను కూడా విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ ఈ కథనంలో సుజుకికి చెందిన మూడు బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు సుజుకి యాక్సెస్ 125, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125, సుజుకి అవెనిస్ 125 గురించి ఈ కథనంలో అందిస్తున్నాం.
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర రూ. 82,586 నుంచి రూ. 94,082 ఎక్స్-షోరూమ్ మధ్య ధరలో అందుబాటులో ఉంది. ఇందులో 124 cc సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 8.7 PS గరిష్ఠ శక్తిని మరియు 10 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు 45 కి.మీ మైలేజీని ఇస్తుంది.
కొత్త సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో చాలా ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్-కనెక్ట్ చేయగల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. వేరియంట్లను బట్టి ఫ్రంట్ డిస్క్ లేదా డ్రమ్, రియర్ డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. బరువు 103 కిలోలు కాగా 5 లీటర్ల కెపాసిటి గల ఫ్య్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంది.

Suzuki Burgman Street 125: ఈ స్కూటర్‌ను కస్టమర్లు రూ. 97,883 నుండి రూ. 1.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఇది 124 cc సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 8.7 PS పవర్ మరియు 10 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు గరిష్ఠంగా 48 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది.
సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌లో సైలెంట్ స్టార్టర్, ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, ఎల్‌ఈడీ హెడ్ లైట్ వంటి వివిధ ఫీచర్లను చూడవచ్చు. రైడర్ భద్రత కోసం ఇందులో డిస్క్ బ్రేక్ ఎంపికను కలిగి ఉంటుంది. బరువు 111 కిలోలు కాగా.. ఈ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.5 లీటర్లు.

Suzuki Avenis 125: మార్కెట్లో సుజుకి అవెనిస్ 125 స్కూటర్ ధర రూ. 94,685 నుంచి రూ. 96,383 మధ్య ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. 124 cc ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఆధారితం. ఇది 8.7 PS గరిష్ఠ శక్తిని మరియు 10 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 55 కి.మీ మైలేజీని ఇస్తుంది.
కొత్త Suzuki Avenis 125 మోడల్‌లో LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్, USB ఛార్జింగ్ పోర్ట్, పూర్తి డిజిటల్ LCD క్లస్టర్ వంటి వివిధ ఫీచర్లను సంస్థ అందిస్తోంది. భద్రత కోసం డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉండగా.. ఈ స్కూటర్ బరువు 106 కిలోలు. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు.


Click it and Unblock the Notifications








