స్టైల్ అండ్ డిజైన్‌లో వీటి స్పెషాలిటీనే వేరు.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ది బెస్ట్ ఇ స్కూటర్లు
భారత్‌లో ఎలక్టిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా, సరసమైన ధరలో అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఈ ఏడాది కొత్త ఇ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి రూ. 70,000 లోపు ధరలో అద్భుతమైన ఈవీల వివరాలు అందిస్తున్నాం.
కొమాకి XGT: భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కొమాకి XGT X వన్(Komaki XGT 0NE). ఈ స్కూటర్ ధర రూ. 50,855 గా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా లైట్ వెయిట్‌తో తక్కువ ధరలో దీన్ని ప్రవేశపెట్టింది. తేలికైన ఫ్రేమ్, అధునాతన ఫీచర్లతో పాటు నగర ప్రయాణాలకు అనువుగా ఈ స్కూటర్ ఉంటుంది.

కైనెటిక్ ఇ లూనా: ప్రముఖ టూ వీలర్ తయారీదారు కైనెటిక్ ఎనర్జీ నుంచి ఇటీవల లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ మోపెడ్ కైనెటిక్ ఇ లూనా. రెట్రో డిజైన్‌తో ఆకర్షణీయంగా ఈ స్కూటర్‌ను రూపొందించారు. భారత మార్కెట్లో Kinetic E Luna ధర రూ. 69,990(ఎక్స్-షోరూమ్) గా ఉంది. పూర్తి ఛార్జ్‌పై 110 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా: దేశంలో ప్రముఖ టూ వీలర్ తయారీదారు హీరో నుంచి ప్రజాదరణ పొందుతున్న ఇ స్కూటర్ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా(Hero Electric Optima). పైన చెప్పిన స్కూటర్లతో పోలిస్తే ఆప్టిమా ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.06 లక్షలు. పూర్తి ఛార్జ్‌పై 135 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. దూర ప్రయాణాలకు ఈ స్కూటర్ అనువుగా ఉంటుంది.

నిర్దిష్ట కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆయా సంస్థలు విడుదల చేసి విక్రయిస్తున్నాయి. వీటిలో Komaki XGT X One సరసమైన ఎంట్రీ-లెవల్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంది. ప్రాక్టికల్ కస్టమర్లకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇక రెట్రో డిజైన్, స్టైల్ మరియు లూనా అభిమానులకు కైనెటిక్ ఇ లూనా బెస్ట్ ఆప్షన్.
ఇక అధునాతన ఫీచర్లు, స్మార్ట్ కనెక్టివిటీ మరియు అధిక రేంజ్‌ను కోరుకునే వారికి హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సరైన స్కూటర్‌గా ఉంటుంది. కాగా మార్కెట్లో ఈ స్కూటర్లు ఇతర కంపెనీల స్కూటర్లకు గట్టి పోటీనిస్తున్నాయి. బడ్జెట్ పరంగా కూడా కస్టమర్లకు ఫేవరెట్‌గా మారాయి.

ఈవీలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల(Electric Scooters Sales in India) సేల్స్ పెరిగిపోయాయి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తయారీదారులు సరసమైన ధర రేంజ్‌లో మరిన్ని మోడళ్లను పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఇ మొబిలిటీ మరింత మెరుగుపడుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








