ఉత్తమ మైలేజ్ అందించే బెస్ట్ బైకులు.. ధర కూడా తక్కువే..

దేశీయ మార్కెట్లో ఎన్ని బైకులు లాంచ్ అయినా.. చాలామంది కొనుగోలు చేయడానికి ఇష్టపడే బైకులు మాత్రం కొంత ప్రత్యేకమనే చెప్పాలి. ఇంతకీ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేసే బైకులు ఏవి? ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ఒక కస్టమర్ ఒక బైక్ కొనుగోలు చేయడానికి ముందు డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా రేంజ్ లేదా మైలేజ్ వంటి వాటిని గురించి తప్పకుండా తెలుసుకుంటారు. కొందరు స్టైలిష్ బైకులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపితే.. చాలామంది రోజు వారీ వినియోగానికి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను సెలక్ట్ చేసుకుంటారు. ఇందులో ప్రధానంగా 125సీసీ బైకులు చెప్పుకోదగ్గవి.

Hero Super Splendor Xtec

హీరో సూపర్ స్ప్లెండర్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్ యొక్క 'స్ప్లెండర్' ఒకప్పటి నుంచి ఇప్పటివరకు గొప్ప అమ్మకాలను పొందగలుగుతోంది. దీనికి ప్రధాన కారణం మైలేజ్ అనే చెప్పాలి. ఈ బైక్ ప్రారంభ ధర రూ.80848 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 124.7 సీసీ ఇంజిన్ కలిగి 10.72 Bhp పవర్ మరియు 10.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 57 కిమీ/లీ నుంచి 60 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

హీరో సూపర్ స్ప్లెండర్ చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. రోజువారీ వినియోగానికి ఖచ్చితంగా సరిపోయే బైకుల జాబితాలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఇంజిన్ పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది ఈ బైకును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే అమ్మకాలు ఈ రోజుకీ బాగానే సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

Honda Shine 125

హోండా షైన్

ఎక్కువ మైలేజ్ అందించే బైకుల జాబితాలో హోండా కంపెనీకి చెందిన షైన్ కూడా ఒకటి. మార్కెట్లో బాగా పాపులర్ అయిన 125 సీసీ బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ కూడా. ఇది 123.94 సీసీ ఇంజిన్ కలిగి 10.59 Bhp పవర్ మరియు 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 79800 (ఎక్స్ షోరూమ్), కాగా ఇది 55 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

హోండా ఎస్​పీ 125

హోండా కంపెనీకి చెందిన ఎస్​పీ 125 బైక్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 124 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.72 Bhp పవర్ మరియు 10.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 65 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్ ప్రారంభ ధర రూ. 86017 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

Bajaj CT 125X

బజాజ్ సీటీ125ఎక్స్ & పల్సర్ 125

బజాజ్ కంపెనీకి చెందిన సీటీ125ఎక్స్ మరియు పల్సర్ 125 కూడా మంచి మైలేజ్ అందించే బైకుల జాబితాలో ఉన్నాయి. ఇవి రెండూ వరుసగా 61.3 కిమీ/లీ మరియు 50 కిమీ/లీ మైలేజ్ అందిస్తాయి. సీటీ125ఎక్స్ బైక్ 124.4సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 10.7 Bhp పవర్ మరియు 11 Nm టార్క్ అందిస్తుంది. ఇక పల్సర్ 125సీసీ ఇంజిన్ కలిగి 11.64 Bhp పవర్, 10.8 Nm టార్క్ అందిస్తుంది.

పైన చెప్పిక బైకులు మాత్రమే కాకుండా.. భారతీయ మార్కెట్లో 125 సీసీ విభాగంలో అప్డేటెడ్ మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ఉత్తమ మైలేజ్ అందిస్తూ.. రోజు వారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన కస్టమర్లు సమీపంలోని డీలర్‌లను సంప్రదించి అప్డేటెడ్ బైకులు గురించి ఖచ్చితమైన మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 27, 2024, 9:40 [IST]
English summary
Best mileage bike in india from hero super splendor and bajaj ct125x
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+