మంచి మైలేజీ ఇచ్చే బైక్స్ మీకోసం.. ఇవి ఒకసారి చూసి డిసైడ్ అవ్వండి.. డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు!
నేడు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు మంచి మైలేజీ ఇచ్చే బైక్స్ కోసం చూస్తూ ఉంటారు. అదే సమయంలో ధర అందుబాటులో ఉందో లేదో చూసుకుని మోటార్‌సైకిల్‌ని కొనుగోలు చేస్తారు. ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్స్ రోజువారి ప్రయాణానికి అలాగే ఆఫీస్, ఇతర పనుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కలిసి వస్తాయి. ప్రస్తుతం టూవీలర్ అనేది ప్రతీ ఇంట్లో భాగం అయ్యింది. దీంతో ప్రతి ఒక్కరు అవసరాలను తీర్చుకోవడం కోసం బైక్స్‌ని లేదా స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ ఎక్కువ మైలేజీ, మంచి ఫీచర్లు ఉన్న బైక్స్‌కి మాత్రమే జనాలు జై కొడుతున్నారు. అయితే మార్కెట్‌లో వందల సంఖ్యలో బైక్‌లు, స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. చాలామందికి వీటిలో ఏది కొనాలో తెలియక తికమక పడతూ ఉంటారు.
ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని టాప్ బైక్స్ మంచి మైలేజీతో పాటు తక్కువ మెయింటైనెన్స్‌ని కలిగి ఉన్నాయి. అందులో హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్, టీవీఎస్ రేడియన్, బజాజ్ ప్లాటినా 110 మరియు హోండా షైన్ 100 వంటివి ఉన్నాయి. ఈ బైక్స్ మంచి మైలేజీని అందిచడంతో పాటు సరసమైన ధరలో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో మీ కోసం..

హీరో స్ప్లెండర్ ప్లస్: ఇందులోని 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 8.02ps శక్తిని, 8.05 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు 80.6 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ ధర రూ.76,356 నుంచి రూ.77,496 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 2024 జూన్‌లో 3 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్: ఇది 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అలాగే 4-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో 9.6-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కలదు. దీని ధర రూ .62,218 నుంచి రూ .70,098 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ బైక్‌కి గ్రామీణ ప్రాంతాల్లో క్రేజ్ ఎక్కువగా ఉంది.

టీవీఎస్ రేడియన్: ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 8.08 ps శక్తిని, 8.7nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటర్‌కి 73.68 మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ ధర రూ .75,293 నుంచి రూ .83,620 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
బజాజ్ ప్లాటినా 110: ఇందులోని 115.45 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ 8.6 ps శక్తిని మరియు 9.81 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ .70,451 నుంచి రూ .80,012 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

హోండా షైన్ 100: ఇది 98.98 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో 4-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంది. ఇది లీటరుకు 68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి వివిధ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ .66,600 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








