మైలేజీలో మాస్టర్ క్లాస్ బైక్స్... ఇప్పటి వరకు మార్కెట్‌లో ఇవే బెస్ట్, ధర ఎక్కువేం కాదు!
మార్కెట్‌లో ఎన్నో టూవీలర్స్ అందుబాటులో ఉన్న కానీ ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్స్‌కి మాత్రమే జనాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ దీపావళికి మీరు కూడా కొత్త బైక్ కొనాలనుకుంటే మార్కెట్‌లో భారీ మైలేజీ అందించే మోటార్‌సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కేవంల లక్ష రూపాయల లోపే ఉండటం గమనార్హం. తక్కువ ధరలో మంచి లాభాలాను ఈ బైక్స్ ద్వారా పొందవచ్చు. ఇందులోని ఒక్కో బైక్ లీటరుకు దాదాపు 100 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తాయి. ఇవి మీ ఇంట్లో ఉంటే మీ ఖర్చులు కూడా తగ్గుతాయి. మంచి మైలేజీ అందించే బైక్స్‌లో బజాజ్, హీరో వంటి బ్రాండ్లకు చెందిన కొన్ని మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ బైక్స్ పై ఓ లుక్కేద్దాం.
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ ఇదే. కొద్ది నెలల క్రితమే ఇది మార్కెట్‌లోకి వచ్చింది. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే మోటార్‌సైకిల్‌గా ఉంది. ఈ బైక్ పెట్రోల్ మోడ్‌లో లీటర్‌కి 65 కి.మీ అలాగే సీఎన్‌జీ మోడ్‌లో కిలోకి 102 కిమీ మైలేజీ అందిస్తుంది.

అయితే ఈ బైక్ రెండు ఫ్యూయల్స్‌లో మొత్తం 330 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 9.5 ps శక్తిని 9.7 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర రూ.95,000 నుంచి రూ.1.10 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.
హీరో స్ప్లెండర్ ప్లస్: ఈ బైక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిల్‌గా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతీ నెలా దాదాపు 3 లక్షల యూనిట్లకు పైగానే ఈ బైక్ అమ్ముడుపోతుంది. ఈ బైక్ 97.2 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7.7 bhp పవర్‌ని 8.05 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ మోటార్‌సైకిల్ లీటర్‌కి దాదాపు 80.6 కిమీ కచ్చితమైన మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 76,306 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటితో వస్తుంది. 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు 1236 మిమీ వీల్‌బేస్‌ని కలిగి ఉంటుంది. హాలోజెన్ హెడ్‌ల్యాంప్, టెయిల్‌లైట్స్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
బజాజ్ ప్లాటినా: ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అంస్తుంది. ఇది 102 సీసీ స్ట్రాంగ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులోని ఇంజిన్ 7.79 ps పవర్‌ని అలాగే గరిష్టంగా 8.34 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దీని ధర రూ .68,685, ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది. 11 లీటర్ల సామర్ధ్యం కలిగి ఉంటుంది.

బజాజ్ సిటి సిరీస్: ఇందులో 110X, సిటీ 125X మోడళ్లున్నాయి. ఇవి లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. సిటీ 125 ఎక్స్ రూ.77,216 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమౌతున్నాయి. అలాగే 110X ధర రూ. 70,000 (ఎక్స్ షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది. రోజువారి అవసరాల కోసం ఈ రెండు బైక్స్ సరిపోతాయి.
ఇవే కాకుండా మార్కెట్‌లో హోండా షైన్ 100, టీవీఎస్ స్పోర్ట్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, హీరో ప్యాషన్ ప్రో బైక్స్ ఉన్నాయి. వీటి ధరలు కూడా రూ. లక్ష లోపే ఉన్నాయి. మంచి ఫర్ఫమెన్స్‌తో పాటు మంచి మైలేజీ బైక్స్ కొనాలని చూస్తే ఇవి మీకు సరిపోతాయి. మరింత సమాచారం కోసం దగ్గర్లోని షోరూమ్‌ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








