మార్కెట్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్‌ 5 బైక్స్‌.. డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు.. కాబట్టి వీటినే ఎంచుకోండి!

భారత్‌లో మోటార్‌సైకిల్స్‌ కొనేవారు ముందుగా మైలేజీని చెక్‌ చేసి కొంటారు. డైలీ కమ్యూటర్ సెగ్మెంట్ మోటార్ సైకిళ్లు భారత్‌లో మంచి పాపులారిటీని కలిగి ఉన్నాయి. జనాలు ఎక్కువగా 100సీసీ, 125సీసీ సెగ్మెంట్లలో లభించే మోటార్ సైకిళ్లను కొంటున్నారు. ప్రధాన కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన ధరలో మంచి మైలేజీ, బెస్ట్‌ ఇంజిన్ ఫర్పామెన్స్ అందించే మోటార్‌సైకిళ్లను ఓసారి పరిశీలిద్దాం..

హోండా షైన్ (Honda Shine): ఈ 'హోండా షైన్' బైక్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 100 సీసీ బైక్‌ ప్రారంభ ధర రూ.62,990 (ఎక్స్‌షోరూమ్‌), ఇక 124 సీసీ సిలిండర్ ఇంజిన్‌ బైక్‌ ధర రూ. 82,151 (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. ఈ బైక్‌ లీటర్‌కి 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్‌ 5 కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

Honda Shine 125

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe): హీరో హెచ్ఎఫ్ డీలక్స్ భారతదేశంలో అత్యంత సరసమైన మోటార్ సైకిల్‌గా ఉంది. దీని ధర రూ.56,674 (ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఈ బైక్‌ ఐదు వేరియంట్లు, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌ని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్నారు.

టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport): ఇది రెండు వేరియంట్స్‌, ఎనిమిది కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ బైక్ 109 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. టీవీఎస్ స్పోర్ట్ ధర రూ.64,410 (ఎక్స్ షోరూమ్)గా ఉంది. స్పోర్టియర్‌ వెర్షన్‌ కోసం స్టార్‌ సిటీ ప్లస్‌ని కొనుగోలు చేయవచ్చు.

Bajaj Platina Mileage

బజాజ్ ప్లాటినా (Bajaj Platina): ఈ బజాజ్ ప్లాటినా 100 సీసీ, 110 సీసీ మోటార్ సైకిళ్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరలు రూ.66,840గా ఉన్నాయి. ఇది కేవలం సింగిల్ వేరియంట్‌లో నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఫుల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 11 లీటర్లుగా ఉంది.

యమహా ఎఫ్జెడ్ ఫై (FZ Fi): ఈ రెండు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త యమహా FZ Fi 149 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్‌ మైలేజీ లీటరుకు 49.31 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ యమహా FZ Fi నేకెడ్ బైక్ ధర రూ .1.16 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

Bajaj Freedom 125

బజాజ్‌ ఫ్రీడమ్‌ సీఎన్‌జీ 125 (Bajaj Freedom 125): బజాజ్‌ సీఎన్‌జీ ఫ్రీడమ్ 125 బైక్‌ ఫుల్‌ ట్యాంక్‌పై 330 కి.మీ (సీఎన్‌జీ మోడ్‌లో 200, పెట్రోల్‌ వెర్షన్‌లో 130) మైలేజీని ఇస్తుంది. ఇది సీఎన్‌జీ, పెట్రోల్ మోడ్‌లో నడుస్తుంది. ఈ బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధరలు రూ. 95,000 నుంచే ఆరంభం అవుతాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 19, 2024, 11:00 [IST]
English summary
Best mileage motorcycles honda shine to bajaj freedom 125 cng
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+