రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
మార్కెట్లో టూ-వీలర్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. భారత్‌లో రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన బైకులు లభిస్తాయి. ఈ కథనంలో రూ.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు గురించి తెలుసుకుందాం.
దేశీయ విఫణిలో రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ప్రధానంగా.. రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ650, కేటిఎమ్ 390 డ్యూక్, కేటిఎమ్ RC 390, యమహా ఆర్3, ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 మరియు ట్రయంఫ్ స్పీడ్ 400 వంటివి ఉన్నాయి. ఇవన్నీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ధర కూడా రూ. 5 లక్షల కంటే తక్కువగానే ఉంటాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ650 (Royal Enfield Continental GT650)
నిజానికి ఎక్కువ మందికి ఇష్టమైన బైకులలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' కంపెనీకి చెందిన 'కాంటినెంటల్ జీటీ650' ఒకటి. ఇది కేఫ్ రేసర్ డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించబడే విధంగా ఉంటుంది. దీని ధర రూ. 3.19 లక్షలు (ఎక్స్ షోరూమ్). 648 సీసీ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 47 Bhp పవర్ డెలివరీ చేస్తుంది. పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.
కేటీఎమ్ 390 డ్యూక్ (KTM 390 Duke)
ఎక్కువమంది యువకులకు ఇష్టమైన బైకుల జాబితాలో ఒకటి కేటీఎమ్ కంపెనీకి చెందిన 390 డ్యూక్ కూడా ఒకటి. రూ. 3.10 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ బైక్ 399 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 45 Bhp పవర్ డెలివరీ చేస్తుంది. అత్యుత్తమ పనితీరుని అందించే ఈ బైక్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాల ఉత్తమంగా ఉంటుంది.

కేటీఎమ్ ఆర్‌సీ 390 (KTM RC 390)
రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో మరొకటి కేటీఎమ్ కంపెనీకి చెందిన ఆర్‌సీ 390. దీని ధర రూ. 3.18 లక్షల (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 373 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 42 Bhp పవర్ డెలివరీ చేస్తుంది. భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉండే ఈ బైకులు ఎక్కువమంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తారు.
యమహా ఆర్3 (Yamaha R3)
యమహా కంపెనీ బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. రూ.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో యమహా ఆర్ 3 ఒకటి. రూ.4.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లభించే ఈ బైక్ 321 సీసీ టూ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 41 Bhp పవర్ డెలివరీ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి.

అల్ట్రావయొలెట్ ఎఫ్77 (Ultraviolette F77)
బెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ కంపెనీ ఎఫ్77 అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ బైక్. ఇది విదేశీ మార్కెట్లో అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతోంది. దేశీయ విఫణిలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 3.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ బైక్ 40 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఇతర బైకుల కంటే చాలా భిన్నంగా.. అత్యద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది.
ట్రయంఫ్ స్పీడ్ 400 (Triumph Speed 400)
ట్రయంఫ్ కంపెనీకి చెందిన స్పీడ్ 400 బైక్ కూడా రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే అద్భుతమైన బైక్. దీని ధర రూ. 2.33 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 398 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 39 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది బ్రాండ్ యొక్క అతి చిన్న మోటార్ సైకిల్.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








