ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనుగోలు చేస్తున్నారా ?? తక్కువ ధర.. ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్లు మీకోసం!!

ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. దీంతో దేశంలో పలు కంపెనీలు సరికొత్త స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్‌లో అందుబాటులోకి ఉన్న స్కూటర్లతో ఏది కొనాలో తెలియక జనాలు అయోమయంలో పడిపోతున్నారు. ఈ గందరగోళాన్ని తీర్చడం కోసం మీకు బెస్ట్‌ స్కూటర్ల వివరాలను వెల్లడిస్తున్నాము.

రోజువారీ వినియోగం లేదా లాంగ్‌ జర్నీ కోసం అధిక రేంజ్ అందించే స్కూటర్లు.. అద్భుతమైన డిజైన్లు మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో మార్కెట్‌లో పలు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి కంఫర్ట్‌తో పాటు పర్యావరణ హితాన్ని కోరుకునే యువతరానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆప్షన్‌గా మారాయి. దీంతో గత కొన్నేళ్లుగా దేశంలో అమ్మకాలు పెరిగాయని.. ప్రభుత్వం కూడా కొనుగోళ్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు భారీడిమాండ్‌ పెరుగుతోంది.

best range electric scooters available in market

1) బజాజ్ ఆటో చేతక్ అర్బనే: ఈ జాబితాలో మొదటగా ఈ స్కూటర్‌ నిలుస్తుంది. 2024లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని సంస్థ విడుదల చేసింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల పరిధి అందిస్తుంది. ఈ స్కూటర్‌ గంటకు 63 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌ ధర ఎక్స్‌షోరూమ్‌ వద్ద రూ.1.15 లక్షలుగా ఉంది.

2) ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాగ్నస్ ఇఎక్స్: ఈ స్కూటర్‌ 3డ్రైవింగ్‌ మోడ్‌లతో వస్తుంది. ఇందులో 22 లీటర్ల స్టోరేజ్, పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్, యుఎస్బి ఛార్జింగ్ పాయింట్, రివర్స్ మోడ్ మరియు సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 112 కి.మీ మైలేజీని అందిస్తుంది. 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీని కలిగి ఉంది. ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.04 లక్షలుగా ఉంది.

low price electric scooters available in india

3) EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఈ స్కూటర్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్కూటర్‌గా చెప్పవచ్చు. 250వాట్ BLDC మోటారుతో నడిచే ఈ స్కూటర్‌ ఫుల్‌ ఛార్జ్ కు 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. 28ఏహెచ్ 72వీ లెడ్ యాసిడ్ బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఎకో ఫ్రెండ్లీ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 72,999 గా ఉంది.

4) యుగ్‌బైక్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ విత్‌ స్టీల్‌గర్డ్‌: మార్కెట్‌లో ఈ స్కూటర్‌కి మంచి డిమాండ్‌ ఉంది. ఇందులోని 60 వి లెడ్ యాసిడ్ బ్యాటరీ 50 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఆర్టీఓ లైసెన్స్ అవసరం లేకుండా పనిచేసే ఈ బైక్‌లో సింగిల్ డిస్క్ బ్రేక్, రివర్స్ ఫంక్షన్ ఉన్నాయి. ఇది 5-6 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 69,999 గా ఉంది.

low price electric scooters available in market

5) ఓకయా ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్: ఈ స్కూటర్‌ అర్బన్ మొబిలిటీ మంచి ఆప్షన్‌గా పరిగణించవచ్చు. ఇది 70-75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్‌ని పూర్తి ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. డిజిటల్ డ్యాష్ బోర్డ్, ట్యూబ్ లెస్ టైర్లు, రిమోట్ కీ లాక్/అన్ లాక్ ఫీచర్ రైడింగ్ అనుభవాన్ని పొందుతుంది. దీని ఎక్స్‌-షోరూమ్ ధర రూ.75,899గా ఉంది.

6) ఏథర్ 450 ఎక్స్ జెన్ 4: 3.7 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని కలిగి ఉన్న అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది అధునాతన బ్యాటరీ టెక్నాలజీ, సూపర్‌ డిజైన్‌ ఇతర అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఏథర్ 450ఎక్స్ జెన్ 4 మంచి ఆప్షన్‌గా ఉంది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.25 లక్షలుగా ఉంది.

best range electric scooters

ఇవే కాకుండా మార్కెట్‌లో మంచి రేంజ్‌ అందించే స్కూటర్లు ఉన్నాయి. అందులో ఫ్లెక్స్ బై కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 120 కిలోమీటర్ల రేంజ్‌ని పరిధిని అందిస్తుంది. మరొక స్కూటర్‌ వ్రోలీ 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 90 కి.మీ రేంజ్‌, ఈఓఎక్స్ డెలివరీ ఎలక్ట్రిక్ స్కూటర్ 80 కిలోమీటర్లు. డాల్ఫిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కీగల్‌ స్కూటర్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల పరిధి అందించే పలు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 30, 2024, 13:15 [IST]
English summary
Best range and low price electric scooters available in market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+