కొత్త స్కూటర్ కొంటున్నారా.?? తక్కువ ధర, అధిక మైలేజ్‌తో టాప్ 3 స్కూటర్లు ఇవే.!!
దేశంలో ఇప్పుడు నిత్యావసరాల కోసం ప్రతి ఒక్కరికీ టూ వీలర్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే కొంతమంది ఎక్కువగా బైక్ కంటే స్కూటర్‌ను తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. మరి మీరు కూడా మీ రోజువారీ అవసరాల కోసం కొత్త స్కూటర్‌ను కొనాలనుకుంటే.. సరసమైన ధరలో గరిష్ఠ మైలేజ్ అందించే కొన్ని స్కూటర్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
టీవీఎస్ జూపిటర్ 125(TVS Jupiter 125): భారత మార్కెట్లో టాప్ టూ వీలర్లలో ఒకటి టీవీఎస్ మోటార్స్ అందిస్తున్న జూపిటర్ 125. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,155 నుండి రూ. 99,805 మధ్య అందుబాటులో ఉంది. కాగా ఇందులో డ్రమ్, డిస్క్ బ్రేక్ ఆప్షన్లు ఉన్నాయి.

టీవీఎస్ జూపిటర్ 125 ప్రిస్టైన్ వైట్, ఇండ్ బ్లూ, డాన్ ఆరెంజ్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, LED హెడ్ ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్ వంటి వివిధ ఫీచర్లను చూడవచ్చు.
టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్.. 124.8 cc సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 8.2 PS గరిష్ట శక్తిని మరియు 10.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగరంలో లీటర్‌కు 57.27 కి.మీ మైలేజ్ అందిస్తుండగా.. హైవేపై 52.91 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. దీని బరువు 108 కిలోలు.
సుజుకి యాక్సెస్ 125(Suzuki Access 125): ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి నుంచి అందుబాటులో ఉన్న అద్భుతమైన స్కూటర్ సుజుకి యాక్సెస్ 125. ఈ స్కూటర్ రూ.83,482 నుంచి రూ.94,082 ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. 124 cc సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 8.7 PS గరిష్ట శక్తిని మరియు 10 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి యాక్సెస్ లీటర్‌కు 45 కి.మీ మైలేజ్‌ని ఇస్తుంది. ఫీచర్ల పరంగా ఇందులో బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయగల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. వేరియంట్‌లను బట్టి ఇందులో ఫ్రంట్ (Front) డిస్క్ లేదా డ్రమ్, వెనుక (Rear) డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ బరువు దాదాపు 103 కిలోలు.
హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్(Hero Pleasure Plus Scooter): హీరో నుంచి ప్లెజర్ ప్లస్ స్కూటర్‌కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.71,788 నుండి రూ.83,918 వరకు అందుబాటులో ఉంది. ఇది LX, VX సహా 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

పెరల్ సిల్వర్ వైట్, మ్యాట్ వెర్నియర్ గ్రే, పోలెస్టార్ బ్లూ, స్పోర్ట్ రెడ్, మ్యాట్ మెడ్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ప్లెజర్ ప్లస్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ 110.9 cc ఇంజన్‌తో పనిచేస్తుంది. 8.1 PS గరిష్ట శక్తిని మరియు 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్ లీటర్‌కు 50 కి.మీ మైలేజ్‌ని అందిస్తుంది. 4.8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని బరువు 106 కిలోలుగా ఉంది. కాగా తాజాగా హీరో తన ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ మోడల్‌లో స్పోర్ట్స్ వేరియంట్‌ను విడుదల చేసింది. ధర రూ. 79,738(ఎక్స్‌షోరూమ్) గా ఉంది.


Click it and Unblock the Notifications








