Best Scooters లక్ష రూపాయల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్కూటర్లు.. వీటిని ఢీకొట్టేవి మార్కెట్‌లో లేవు!!

రూ. లక్షలోపు ధరలో ది బెస్ట్ స్కూటర్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్ల కంటే చాలామంది ఇంధన స్కూటర్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఇంధనంతో నడిచే టూ-వీలర్స్‌ అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎటువంటి స్కూటర్‌ని కొనాలి వాటి వల్ల ప్రయోజనాలు తెలియక సతమతమవుతారు.

రోజువారీ ప్రయాణం కోసం టూ-వీలర్స్‌లను జనాలు ఎక్కువగా వినియోగిస్తారు. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌ అందించడం.. అన్ని విధాలా సౌకర్యం ఉండటం వల్ల టూ-వీలర్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. మార్కెట్‌లో ప్రస్తుతం తక్కువ ధరలో అందుబాటులో ఉన్న స్కూటర్లు, విశ్వసనీయత మరియు అధిక పనితీరు అందించే స్కూటర్లపై ఓ అంచనాకు తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నాం.

Honda-Activa-6G

హోండా యాక్టివా 6జీ: టూ-వీలర్ స్కూటర్స్‌ అనగానే ప్రతి ఒక్కరికి టక్కున హోండా యాక్టివా గుర్తుకువస్తుంది. ప్రస్తుతం Honda Activa 6G అందుబాటులో ఉంది. మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.76,234 నుంచి రూ.82,234 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇందులోని 109సీసీ ఇంజన్ గరిష్టంగా 7.79బిహెచ్ పి పవర్ మరియు 8.84ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా యాక్టివా 6జీ 105 కిలోల బరువు ఉంది.

హోండా యాక్టివా 6జీ 5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ ఫ్రంట్ ఫూట్‌రెస్ట్‌, లాకింగ్ హుక్ మరియు 18 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ సామర్థ్యం వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. జూపిటర్ 125 కంటే తక్కువ బూట్‌స్పేస్‌ కలిగి ఉన్నప్పటికీ, యాక్టివా 6జీ మెరుగైన ఫీచర్లను కలిగి ఉండటం వల్ల ఇప్పటికీ కింగ్‌మేకర్‌గా కొనసాగుతోంది.

Honda-Activa-125

హోండా యాక్టివా 125: Honda Activa 125 ధర రూ .79,806 నుండి రూ .88,979 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని 124 సిసి ఇంజన్ గరిష్టంగా 8.30బీహెచ్పీ పవర్ మరియు 10.4ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 109 కిలోల బరువున్న ఈ స్కూటర్‌లో 5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. ఇది లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

సుజుకి యాక్సెస్ 125: సుజుకి యాక్సెస్ 125 నాలుగు వేరియంట్లలో లభిస్తుంది, దీని ధరలు రూ.79,899 నుండి రూ .90,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. 124సీసీ కెపాసిటి గల ఇంజన్ గరిష్టంగా 8.7బిహెచ్ పి పవర్ మరియు 10ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ మొత్తం 103 కిలోల బరువు మరియు 5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది, ఇది లీటరుకు 64 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

TVS-Jupiter

టీవీఎస్ జూపిటర్ 125: TVS Jupiter 125 రూ .83,755 నుండి రూ.90,555 (ఎక్స్-షోరూమ్) ధరల వద్ద లభిస్తుంది. 124సీసీ కెపాసిటి కలిగి ఉన్న ఈ స్కూటర్‌.. మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఇంజన్ 8.15బిహెచ్ పి పవర్ మరియు 10.5ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 108 కిలోల బరువున్న ఈ స్కూటర్లో 5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఇది లీటరుకు 57 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

TVS-Ntorq

టీవీఎస్ ఎన్ టార్క్ 125: ఈ స్కూటర్‌ ఆరు వేరియంట్లలో లభిస్తుంది, దీని ధర రూ .84,536 నుండి రూ .1.04 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇందులోని 124 సిసి ఇంజన్ గరిష్టంగా 9.38బిహెచ్ పి పవర్ మరియు 10.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్లో 5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. లీటరుకు 54 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పైన పేర్కొన్న ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుంది. రీడర్లు గమనించగలరు.

More from DriveSpark

Article Published On: Friday, February 9, 2024, 20:16 [IST]
English summary
Best scooters under rs 1 lakh available in the market honda activa 5g to tvs ntorq
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+