60 కి.మీ తగ్గకుండా మైలేజీ.. ఈ 'షైన్' బండికి సాటేది.. తక్కువ ధర, ఎక్కువ లాభాలు

ప్రస్తుత కాలంలో రోజువారీ జీవనం సాఫీగా సాగాలంటే బైక్‌ తప్పనిసరి. టూ వీలర్‌ ఉంటేనే అందరికీ అనుకున్న సమయాల్లో తాము అనుకున్న పనులు పూర్తవుతాయి. అయితే ఎలాంటి బైక్‌ కొనాలని చాలా మందికి గందరగోళం ఉంటుంది. తక్కువ ధరలో, అద్భుతమైన మైలేజ్‌ అందిస్తూ, ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులో ఉండే ఓ ప్రముఖ కంపెనీ బైక్‌ల వివరాలు ఈ కథనంలో అందిస్తున్నాం.

భారత్‌లో హోండా మోటార్‌సైకిల్స్ అండ్‌ స్కూటర్స్‌ ఇండియాకు ప్రత్యేక స్థానం ఉంది. సేల్స్‌ పరంగా ప్రతి నెలా ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరుపుతూ టాప్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్‌ ధరలో హోండా.. షైన్‌, SP, యూనికార్న్‌ ఇంకా పలు మోడళ్ల బైక్‌లను విక్రయిస్తోంది. అయితే ఇక్కడ సరసమైన ధరలో మంచి మైలేజ్‌ అందించే మూడు హోండా బైక్‌ల వివరాలు అందిస్తున్నాం.

Best-Selling-Bikes-From-Honda

హోండా SP 125: భారత మార్కెట్లో హోండా SP125 ధర రూ. 87,410 నుంచి రూ. 91,960 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ బైక్‌ 123.94 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 10.87 PS గరిష్ట శక్తిని మరియు 10.9 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ఈ హోండా SP 125 బైక్ లీటర్‌కు 60 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. LED హెడ్ ల్యాంప్, పూర్తి-LCD ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది. రైడర్‌ సేఫ్టీ కోసం డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌ బరువు 116 కిలోలు. హోండా SP125 ఫ్యూయెల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 11.2-లీటర్.

Best-Selling-Bikes-From-Honda

హోండా షైన్: మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో సరసమైన హోండా బైక్‌ Honda Shine మోటార్‌సైకిల్. ఈ బైక్‌ వేరియంట్‌ను బట్టి రూ. 81,100 నుంచి రూ. 85,100 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది 125 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. 10.74 PS పవర్ మరియు 11 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. లీటర్‌కు 55 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఫ్యూయెల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 10.5 లీటర్‌. కొత్త హోండా షైన్ బైక్ బ్లాక్, జెన్నీ గ్రే మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్ వంటి 5 ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఇంజన్ కిల్ స్విచ్, అల్లాయ్ వీల్స్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్ వంటి ఫీచర్లతో వస్తుంది.

Best-Selling-Bikes-From-Honda

హోండా CB యునికార్న్: యూత్‌ ఫేవరెట్‌ హోండా యూనికార్న్‌ రూ.1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉంది. 162.71 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 12.91 PS పవర్ మరియు 14.58 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటుంది. మరియు లీటర్‌కు 60 కి.మీ మైలేజ్‌ని అందిస్తుంది.

హోండా యునికార్న్‌లో ఫీచర్ల పరంగా అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇంజన్ కిల్ స్విచ్ సహా వివిధ ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో సింగిల్ ఛానల్ ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ బరువు 140 కిలోలు. ఫ్యూయెల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 13-లీటర్.

More from DriveSpark

Article Published On: Friday, April 26, 2024, 10:07 [IST]
English summary
Best selling bikes from honda at low budget sp 125 shine and cb unicorn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+