తక్కువ ధరలో అధిక మైలేజ్‌.. ఈ టీవీఎస్‌ బైక్‌లకు సాటి లేదు..

రోజువారీ కార్యకలాపాలకు ఇప్పుడు టూ వీలర్‌ తప్పనిసరిగా మారిపోయింది. అయితే తమ బడ్జెట్‌ ధరలో ఏ బైక్‌ కొనాలనే విషయంలో చాలా మందికి కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో ప్రముఖ కంపెనీల బైక్‌లతో పాటు చాలా రకాల బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీ కోసం అత్యంత సరసమైన ధరలో లభించే బైక్‌ల గురించి అందిస్తున్నాం.

దేశీ బ్రాండ్ టీవీఎస్‌ టూ వీలర్ల(TVS Bikes At Affordable Prices)కు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. అధిక మైలేజ్‌ ఇవ్వడంతో పాటు సరసమైన ధరలో కూడా అందుబాటులో ఉండటంతో జనం ఎగబడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో మీరు తక్కువ ధరలో టీవీఎస్‌ బైక్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఓ సారి ఈ ద్విచక్ర వాహనాలపై లుక్కేయండి.

TVS-Bikes-At-Affordable-Prices

టీవీఎస్‌ స్పోర్ట్‌: భారత మార్కెట్లో TVS Sport బైక్‌ ధర రూ. 66,320 నుంచి రూ. 71,023 మధ్య అందుబాటులో ఉంది. ఇవి ఎక్స్‌-షోరూమ్‌ ధరలు. ఈ బైక్‌ 109.7 cc, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

టీవీఎస్‌ స్పోర్ట్‌ గరిష్ఠంగా 8.19 PS శక్తిని మరియు 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త టీవీఎస్‌ స్పోర్ట్‌ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్‌ గరిష్ఠంగా లీటర్‌కు 70 km మైలేజ్‌ని అందిస్తుంది. సిటీ అవసరాలకు ఈ బైక్‌ సరిపోతుంది.

TVS-Bikes-At-Affordable-Prices

అంతేకాకుండా TVS ​​స్పోర్ట్ గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆకర్షణీయమైన హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ వంటి వివిధ ఫీచర్లను ఇందులో చూడవచ్చు. అంతేకాకుండా భద్రత కోసం ఇందులో డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇక ఈ బైక్‌ బరువు సుమారు 112 కిలోలు.

TVS స్టార్ సిటీ ప్లస్: టీవీఎస్‌ Star City Plus బైక్ ధర మార్కెట్లో రూ. 77,138 నుంచి రూ. 80,288 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందులో 109 cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ బైక్‌ 8.08 PS గరిష్ట శక్తిని మరియు 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటుంది.

TVS-Bikes-At-Affordable-Prices

టీవీఎస్‌ స్టార్ సిటీ ప్లస్ లీటర్‌కు 83.09 కి.మీ గరిష్ఠ మైలేజ్‌ని అందిస్తుంది. ఈ బైక్‌ గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. LED హెడ్ లైట్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్, USB ఛార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లను చూడవచ్చు. భద్రత కోసం ఇందులో డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను ఉపయోగించారు. ఫ్యూయెల్‌ ట్యాంక్‌ సామర్థ్యం 10 లీటర్లు. బరువు 116 కిలోలు.

టీవీఎస్ రైడర్: TVS Raider బైక్‌ ధర రూ. 98,709 నుండి రూ.1.08 లక్షల(ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉంది. 124.8 cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 11.38 PS శక్తిని మరియు 11.2 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండగా.. లీటర్‌కు 71.94 కి.మీ మైలేజీని అందిస్తుంది.

TVS ​​రైడర్ ఎకో, స్పోర్ట్స్ రైడింగ్ మోడ్ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. ఇందులో LED హెడ్‌లైట్, హాలోజన్ ఇండికేటర్లు, USB ఛార్జింగ్ పోర్ట్, LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తుంది. భద్రత కోసం డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉండగా.. ఇందులో 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. ఈ బైక్‌ బరువు 123 కిలోలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 4, 2024, 9:17 [IST]
English summary
Best tvs bikes at affordable prices with high mileage sport star city plus and raider
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+