అట్టహాసంగా CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ గ్రాండ్ ఫినాలే.. ఛాంపియన్లు వీరే
CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) తన ప్రారంభ సీజన్ గ్రాండ్ ఫినాలే బెంగుళూరు(Bengaluru)లో ఘనంగా ముగిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ప్రదర్శనలో హోమ్ టీమ్, బిగ్‌రాక్ మోటార్‌స్పోర్ట్ విజేతగా నిలిచింది. గ్రాండ్ ఫినాలేలో ఆధిపత్యం చెలాయించి ప్రారంభ CEAT ISRL సీజన్‌లో ఛాంపియన్‌గా స్థానం సంపాదించుకుంది.
స్టార్ అథ్లెట్ మాట్ మాస్, కవాసకి రైడింగ్, 450cc అంతర్జాతీయ రేసులో మొదటి స్థానంలో నిలిచి.. నిజమైన సూపర్‌క్రాస్ ఛాంపియన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కాగా 250cc అంతర్జాతీయ రేసులో బిగ్‌రాక్ మోటార్‌స్పోర్ట్స్‌కు చెందిన రీడ్ టేలర్ మొదటి స్థానంలో నిలవగా.. 250సీసీ ఇండియా ఆసియా మిక్స్ విభాగంలో, బిగ్‌రాక్ మోటార్‌స్పోర్ట్‌కు చెందిన డైనమిక్ రైడర్, కవాసకి రైడింగ్‌కు చెందిన థానరత్ పెన్జన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

బెంగుళూరులో జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేను మొత్తం 8000 మంది ప్రత్యక్షంగా వీక్షించగా.. ఈ సీజన్ మొత్తంలో 30,000 మందికి పైగా గ్రౌండ్ క్రౌండ్‌తో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అంచనాలను మించి, హై-స్పీడ్ యాక్షన్, డేరింగ్ విన్యాసాలు, ఉత్సుకత కలిగించే ముగింపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారతీయ మోటార్‌స్పోర్ట్స్‌లో ఈ ఈవెంట్ కొత్త అధ్యాయానికి తెర తీసింది.
బెంగుళూరులో జరిగిన గ్రాండ్ ఫినాలే తమ అంచనాలను మించిపోయిందని.. మరింత ఉత్కంఠభరితమైన రెండవ సీజన్‌కు వేదికగా నిలిచిందని CEAT ISRL సహ వ్యవస్థాపకుడు, లిల్లేరియా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వీర్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌ను ఇంత మంది ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించడం సంతోషం కలిగించిందిన్నారు.

FMSI, FIM, రేసింగ్ టీమ్‌లు, భాగస్వాముల మద్దతుతో.. సూపర్‌క్రాస్‌కు భారతదేశాన్ని కేంద్ర బిందువుగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. CEAT ISRL ప్రారంభ సీజన్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా రైడర్లు, స్పాన్సర్లు, అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

CEAT ISRL ప్రారంభ సీజన్ ముగియడంతో రెండో సీజన్ కోసం అత్యంత ఉత్సాహంతో రేసింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా అన్ని వయసుల మరియు నైపుణ్యం కలిగిన రైడర్‌లకు సురక్షితమైన మరియు పోటీతత్వ వేదికను అందించడమే ఈ ఈవెంట్ లక్ష్యం. క్రీడాస్ఫూర్తి, యువత అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వం CEAT ISRL ముఖ్య ఉద్దేశం.

CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) అనేది ప్రపంచంలోనే మొదటి ఫ్రాంఛైజీ ఆధారిత సూపర్‌క్రాస్ లీగ్. ఈ ఈవెంట్ ద్వారా భారతదేశంలో క్రీడలను గుర్తించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా భారతీయ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ పోటీలు కొనసాగుతున్నాయి.
రేసింగ్ అభిమానులను విస్మయపరిచే బైక్ రేసింగ్‌లు ద్వారా గ్రౌండ్‌లో ఓ పండుగ వాతావరణం నెలకొంటోంది. అంతేకాకుండా CEAT ISRL ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను వివిధ రకాల ఫార్మాట్‌లు మరియు విభాగాల్లో పోటీ పడేలా చేస్తుంది. భారతీయుల రైడర్ల నైపుణ్యాలను ఇంకా పెంచి, వారు కొత్త శిఖరాలకు చేరుకునేందుకు దోహదపడుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








