యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ బైక్స్ మరింత సేఫ్.. ఇదిగో లిస్ట్!
ప్రస్తుతం దేశంలో టూవీలర్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. అందువల్ల మంచి ఫీచర్లు మైలేజీ లేదా రేంజ్ అందించే బైక్‌లతో పాటు సేఫ్టీకి అధిక ప్రాధాన్యతను ఇచ్చే బైక్ కంపెనీలను కస్టమర్లు ఎంచుకుంటున్నారు. మారిన టెక్నాలజీకి అనుగుణంగా బైకు ఉత్పత్తి సంస్థలు కూడా అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి సేఫ్టీ ఫీచర్లను జోడిస్తున్నాయి. ఇక్కడే మీకు బైక్స్‌లో సేఫ్టీ ఏంటి అనే ప్రశ్న తలెత్తవచ్చు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ABS (యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం) అనేది బైక్స్‌లో చాలా కీలకం. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
టూవీలర్స్‌లో ఏబీఎస్ అనేది కీలకమైన సేఫ్టీ ఫీచర్‌గా ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఫీచర్ ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు చక్రాలను పూర్తిగా లాక్ చేయకుండా ఈ వ్యవస్థ నిరోధిస్తుంది. దీనివల్ల వాహనం నియంత్రణ కోల్పోకుండా ఉంటుంది. చాలా మోటార్ సైకిళ్లలో ఈ వ్యవస్థ ప్రామాణికంగా అందిచనప్పటికీ ఏబీఎస్ వ్యవస్థను కొన్ని మోటార్ సైకిళ్లలో అందిస్తున్నారు.

ఏబీఎస్ ఛానల్ అనేదీ సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. సింగిల్ ఛానల్ కేవలం ముందు చక్రానికి మాత్రమే సేఫ్టీని అందిస్తుంది. డ్యూయల్ ఛానల్ వెనుక చక్రాలకు భద్రతను కూడా అందిస్తుంది. భారతదేశంలో డ్యూయల్ ఛానల్ ABS అందించే టాప్ -5 అత్యంత సరసమైన మోటార్ సైకిళ్ల జాబితా మీకోసం..
బజాజ్ పల్సర్ NS 160: బజాజ్ పల్సర్ NS 160 డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో లభించే అత్యంత సరసమైన బైక్‌గా ఉంది. దీని ధర రూ .1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులోని 160సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 17.03bhp పవర్ మరియు 14.6nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది.

బజాజ్ పల్సర్ N 160: బజాజ్ పల్సర్ N 160 కూడా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. దీని ధర రూ.1.32 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. పల్సర్ N 160 బైక్ 164.82 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 15.7bhp పవర్ మరియు 14.65nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ కూడా 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది.
టీవీఎస్ అపాచీ RTR 200 4V: టీవీఎస్ అపాచీ RTR 200 4V డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. దీని ధర రూ.1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ 197.75 సీసీ సింగిల్ సిలిండర్, 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 20.2bhp శక్తిని మరియు 16.8nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది.

బజాజ్ పల్సర్ N 250/ F250: పల్సర్ N250 మరియు F 250 కూడా డ్యూయల్ ఏబీఎస్ ఛానల్‌ని కలిగి ఉన్నాయి. దీని ధర రూ .1.51 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోటార్ సైకిళ్లలో 249 సిసి సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఇది 24.1 bhpపవర్ మరియు 21.5 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ జతచేయబడి ఉంటుంది.
బజాజ్ పల్సర్ NS 200: చివరగా డ్యూయల్ ఏబీఎస్‌తో వచ్చే బజాజ్ పల్సర్ NS 200 ధర రూ .150 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పల్సర్ NS 200 బైక్‌లో 199 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఈ ఇంజిన్ గరిష్టంగా 24.13bhp పవర్ మరియు 18.74nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








