స్మార్ట్ హెల్మెట్‌ విడుదల.. బయటి శబ్దాలు లోపలికి పోవు.. ఫోన్‌ మాడ్లడవచ్చు, ఇంకా మరెన్నో ఫీచర్లు

హెల్మెట్‌ ధరించి మీ స్నేహితులతో బైక్‌పై వెళ్తుంటే వారు మాట్లాడేది మీకు వినిపించకపోవచ్చు. అయితే మార్కెట్‌లోకి వచ్చిన ఈ కొత్త హెల్మెట్ పెట్టుకుంటే లోపల ఎవరో మాట్లాడుతున్నట్లు వినబడుతుందంటే మీరు నమ్ముతారా? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది బైక్ రైడర్లు ఒకేసారి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా వినపడే టెక్నాలజీతో ఓ హెల్మెట్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఆ హెల్మెట్‌ ధర ఎంత? దానిలోని ప్రత్యేకతలు ఇతర వివరాలు ఈ కథనంలో..

బైక్ హెల్మెట్స్‌ కోసం కూలింగ్‌, కమ్యూనికేషన్ టెక్నాలజీని డెవలప్‌ చేయడంలో ప్రత్యేకత కలిగిన సంస్థ బ్లూఅర్మర్ (Bluarmor). బెంగళూరుకు చెందిన ఈ బ్లూఆర్మర్ సంస్థ సీ50 ప్రో పేరుతో కొత్త హెల్మెట్‌ని ఇంటర్‌కామ్ సిస్టమ్‌తో (Intercom System) లాంచ్ చేసింది. ఈ కొత్త హెల్మెట్ ఇంటర్‌కామ్ సిస్టమ్‌ ధర రూ.24,999గా ఉంది. ఆసక్తి ఉన్నవారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి సీ50 ప్రో ను కొనుగోలు చేయవచ్చు.

Bluarmor Launches New C50 Pro Helmet Intercom System

ఇప్పుడు బుక్‌ చేసుకున్న వారికి సెప్టెంబర్ 28 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని బ్లూఆర్మర్ తెలిపింది. అదేవిధంగా గతంలో విడుదల చేసిన బ్లూఆర్మర్ సీ30 అనే హెల్మెట్ కమ్యూనికేషన్ పరికరంగా ఉండేది. అయితే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. ఇందులోని పెద్ద సైజులోని సీ30లో బటన్లు ఉపయోగించడం కొంచెం కష్టంగా ఉండేది. బ్లూఆర్మోర్ కొత్త సీ50 ప్రో డివైజ్‌లో ఆ లోపాలన్నింటినీ సరిచేసింది.

కొత్త సీ50 బ్లూఆర్మోర్ సీ30 కంటే సొగసైనది. అయితే పరిమాణంలో చిన్నదిగా ఉంది. అదేవిధంగా సీ50 ప్రో కూడా చాలా సాంకేతిక ఫీచర్లతో వస్తుంది. రైడర్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌కి అనుగుణంగా సీ50 ప్రోను అభివృద్ధి చేశారు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 16 గంటల పాటు నాన్ స్టాప్‌గా ఉపయోగించుకోవచ్చు. మాక్ డక్ సిస్టమ్ కారణంగా హెల్మెట్‌కి ఈ పరికరం అమర్చడం సులభతరం చేసింది.

Bluarmor Launches New C50 Pro Helmet Intercom System

అయితే ఈ టూల్‌తో హెల్మెట్ ఆకారం మారదని బ్లూఆర్మర్ చెబుతోంది. అంతే కాకుండా ఈ పరికరం ఐపీ 67 సర్టిఫై చేయబడింది. రైడర్ గ్రిడ్మ్ 2.0 హార్డ్‌వేర్‌ను సీ50ప్రో లో ఉన్న మెష్‌ ఇంటర్‌కామ్ సిస్టమ్‌ ఉంది. ఇది సీ30లో ఉపయోగించే రైడర్ గ్రిడ్ 1.0 హార్డ్‌వేర్ కంటే ఇది చాలా శక్తివంతమైనది. ఈ హార్డ్ వేర్ అప్‌గ్రేడ్ మీకు స్పష్టమైన HD వాయిస్‌ని ఇస్తుంది.

అదనంగా హెల్మెట్లను ఒకదానికొకటి కనెక్ట్ చేయడానికి యాక్టివ్ లింక్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. మరీ ముఖ్యంగా, సీ50 ప్రో రైడర్ గ్రిడ్‌ 2.0 హార్డ్‌వేర్‌ హెల్మెట్లలో ఒకే రకమైన మ్యూజిక్‌ ప్లే చేయవచ్చు. ఈ పరికరం హెల్మెట్ లోపల అమర్చడంతో బయటి నుంచి వచ్చే అనవసరమైన శబ్దాలు వినిపించవు. సీ50 ప్రో PRTVM టెక్నాలజీ మొబైల్ ఫోన్లు, యాక్షన్ కెమెరాలు, జీపీఎస్‌ డివైజ్‌, ఇతర ఇంటర్‌కామ్‌ హెల్మెట్‌కి కనెక్ట్ చేయగలదు.

కనెక్ట్‌ అయిన హెల్మెట్స్‌ ద్వారా ఎవరైనా ఇతర రైడర్లు దారితప్పినట్లయితే లేదా చాలా దూరం వెళ్లిన సందర్భాలు ఉంటే ఈ డివైజ్‌ ఇతర రైడర్లకు అలర్ట్స్‌ని పంపిస్తుంది. బృందాలుగా లాంగ్‌ జర్నీలకు ప్లాన్ చేసే వారికి ఈ హెల్మెట్‌ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ప్రారంభ ఆఫర్‌ కింద సీ50 ప్రోని సెప్టెంబర్ 1 వరకు రూ. 22,000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, August 25, 2024, 12:42 [IST]
English summary
Bluarmor launches c50 pro helmet intercom system check price and features in telugu
Read more on: #Bluarmor #helmet #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+