ఈ బటన్ నొక్కితే చాలు.. ఆటోమేటిక్‌గా గేర్ సిస్టమ్ మారిపోతుంది.. అదెలా అంటే.!!
ప్రముఖ విదేశీ ఆటో మేకర్స్ BMW మోటార్స్ తన బైక్‌ల కోసం కొత్త ఆటోమేటిక్ గేర్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. దీని ప్రకారం, BMW బైక్‌లు ఇప్పుడు రైడర్ నుంచి ఎటువంటి ఇన్‌పుట్ లేకుండానే గేరింగ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ పనితీరుపై పూర్తి సమాచారం ఈ కథనంలో..
ప్రస్తుతం కార్లు ఎక్కువగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పనిచేసేలా ఆటో మేకర్లు తయారు చేస్తున్నారు. ఈ ప్రకారంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కార్లకు ధర ఎక్కువతో పాటు ఆదరణ కూడా ఎక్కువగా ఉంటుంది. కాగా కొంతమంది అనుభవం లేని డ్రైవర్లు, మహిళలతో సహా, ఆటోమేటిక్ గేర్ ఎంపికతో ఉన్న కార్లను కొనుగోలు చేస్తున్నారని వెల్లడైంది.

ఈ సందర్భంలో ఇటువంటి ఆటోమేటిక్ గేర్ ఆప్షన్.. స్కూటర్లలో ఉంది. కాగా బైక్‌లలో ఆటోమేటిక్ గేర్ విధానం తీసుకురావడంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. స్కూటర్లలో CVT గేర్ బాక్స్‌కి కనెక్ట్ అవుతుంది. అయితే బైక్‌లలో కూడా ఇలాంటి టెక్నాలజీ అవసరమని ఆటో నిపుణులు చెబుతున్నారు.
అలాగే కార్లలోని మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో AMT గేర్‌బాక్స్‌ను అమర్చి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌గా మార్చుకుంటారనే చర్చ కూడా చాలా కాలంగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో BMW Motorrad బైక్‌ల కోసం ఆటోమేటిక్ షిఫ్ట్ అసిస్ట్ అనే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. సాధారణ గేర్ బైక్‌కు దీన్ని అమర్చడం ద్వారా, బైక్ ఆటోమేటిక్ గేర్ బైక్‌గా మారుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ సాంకేతికతను ప్రత్యేకంగా ఇంజిన్ల కోసం రూపొందించింది.

BMW Motorrad తీసుకువచ్చిన ఈ ఆటోమేటెడ్ షిఫ్ట్ అసిస్ట్ టెక్నాలజీ(Automated Shift Assist Technology)ని ASA అంటారు. ఈ టెక్నాలజీలో ఆటోమేటిక్ క్లచ్ మరియు గేర్ మార్పు ఉంటుందని సంస్థ చెబుతోంది. బైక్‌లలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ మ్యాన్యువల్ గేర్ ఫీచర్లకు భిన్నంగా ఉంటుండగా.. BMW అలాంటి మార్పులేవి లేకుండా మాన్యువల్ గేర్ షిఫ్టింగ్‌ను ఆటోమేట్ చేయడానికి ASA టెక్నాలజీని తీసుకువచ్చింది.
కాగా ఈ ASA సాంకేతికత కోసం రెండు ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్లను వినియోగిస్తారు. వాటిలో ఒకటి క్లచ్‌ను ఆటోమేట్ చేయడానికి మరియు మరొకటి గేర్‌ను ఆటోమేట్ చేయడానికి దోహదపడుతుంది. అయితే ఇది నేరుగా 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ టెక్నాలజీతో కూడిన బైక్‌కు క్లచ్ అవసరం లేదు కాబట్టి.. క్లచ్ లేకుండా రైడ్ చేయవచ్చు.

ఈ టెక్నాలజీ ఉన్న బైక్‌కు క్లచ్ ఉండదు కాబట్టి మీరు బైక్‌ను స్టార్ట్ చేసి ఆటోమేటిక్ గేర్‌లో ఉంచినట్లయితే, మీరు నేరుగా యాక్సిలరేటర్‌ను స్క్రూ చేస్తే సరిపోతుందని బీఎండబ్ల్యూ వెల్లడించింది. ఇంకా బైక్ ఆటోమేటిక్‌గా ప్రయాణిస్తుంది. దీని ద్వారా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఇది మీకు సాఫీగా ప్రయాణించే అనుభూతిని కలిగిస్తుంది.
అదే సమయంలో ఈ ASA టెక్నాలజీ ద్వారా కొండ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చని బీఎండబ్ల్యూ మోటోరాడ్ వెల్లడించింది. మీ రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఈ టెక్నాలజీ పనిచేయడమే కాకుండా అధిక పనితీరు గల రైడ్‌ను అందజేస్తుందని సంస్థ చెబుతోంది.
కాగా ASA టెక్నాలజీలో రెండు వేర్వేరు మోడ్‌లు ఉన్నాయి. M మోడ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, ఇది పూర్తిగా మాన్యువల్ గేర్‌గా పనిచేస్తుంది. దీనికి ఆటోమేటిక్ ఫంక్షన్ లేదు. క్లచ్ మాత్రమే ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇక మీరు D మోడ్‌కి మార్చినట్లయితే, పూర్తిగా ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో ప్రయాణించవచ్చు.
రైడర్ నుంచి ఎటువంటి ఇన్‌పుట్ ఇవ్వకుండా, బైక్‌లోని ఎలక్ట్రానిక్ భాగాలు బైక్ రైడింగ్ కండిషన్‌కు అనుగుణంగా వాహనాన్ని ప్రస్తుత గేర్‌కు అనుగుణంగా మారుస్తాయని సంస్థ వెల్లడించింది. ఇందులోని రెండు ఎలక్ట్రోమెకానికల్ యాక్టివేటర్లలో ఒకటి క్లచ్ ఆటోమేటిక్ ఫంక్షన్లను.. మరొకటి గేర్ షిఫ్టింగ్ విధులను నిర్వహిస్తుందని చెప్పుకొన్నాం.
కాగా ఇంజిన్ కంట్రోల్ యూనిట్.. రైడర్ అందించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా రైడింగ్ కండిషన్‌ను గ్రహిస్తూ.. దానికి అనుగుణంగా ఎలా పని చేయాలో ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్‌లకు సూచనలను పంపుతుంది. ఇలా ASA సాంకేతికత పనిచేస్తుంది. ఈ టెక్నాలజీని అమర్చడం వల్ల వాహనాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే వారు.. ఆఫ్ రోడింగ్ చేసేవారికి రైడింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


Click it and Unblock the Notifications








