దడ పుట్టించే ధర వద్ద లాంచ్ అయిన బీఎండబ్ల్యూ బైక్స్ - పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో కొత్త బైకులకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) ఎట్టకేలకు మరో రెండు బైకులను లాంచ్ చేసింది. అవి బీఎండబ్ల్యూ ఆర్ 12 మరియు బీఎండబ్ల్యూ ఆర్ 12 నైన్‌టి రోడ్‌స్టర్. ఈ రెండు బైకులు ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైకుల ధర ఎంత? డిజైన్ మరియు ఫీచర్స్ వంటివి మాత్రమే కాకుండా.. ఇంజిన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

బీఎండబ్ల్యూ మోటొరాడ్ లాంచ్ చేసిన ఆర్ 12 మరియు ఆర్ 12 నైన్‌టి రోడ్‌స్టర్ ధరలు వరుసగా రూ. 19.90 లక్షలు మరియు రూ. 20.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ రెండు మోడల్స్ మధ్య ఏకంగా రూ. 1 లక్ష వరకు వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ రెండూ చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ, ఫ్యూయెల్ ట్యాంక్ వద్ద, ఇతర ప్రాంతాల్లో కొంత వ్యత్యాసం గమనించవచ్చు.

BMW R 12

బీఎండబ్ల్యూ యొక్క హెరిటేజ్ మోటార్‌సైకిల్ శ్రేణిలో ఉంచబడిన ఈ కొత్త మోడల్‌లు భారతీయ మార్కెట్లో ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ మరియు ట్రయంఫ్ బోన్నెవిల్లే స్పీడ్‌మాస్టర్‌ వంటి వాటికి ప్రత్యర్థులుగా ఉంటాయి. వీటిలో అల్యూమినియం ట్యాంక్, బ్రష్డ్ సైడ్ ప్యానెల్‌లు, డ్యూయల్ ఎగ్జాస్ట్‌లు మరియు స్పోక్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ బైకులకు క్లాసిక్ రెట్రో డిజైన్ అందిస్తాయి.

ఈ కొత్త బైక్స్ 1170 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 7000 rpm వద్ద 110 Bhp పవర్ మరియు 6500 rpm వద్ద 115 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి. ఈ రెండు బైకులు సిబియూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశానికి దిగుమతి అవుతాయి. డెలివటీలు సెప్టెంబర్ 2024లో ప్రారంభమవుతాయి.

BMW R 12 NineT

ఆర్12 నైన్‌టి బైక్ బ్లాక్‌స్టార్మ్, అల్యూమినియం నైట్ బ్లాక్ మరియు శాన్ రెమో గ్రీన్ పెయింట్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆర్ 12 బైక్ మాత్రం ఒకే సీటును కలిగి ఉంటుంది. ఇందులో 19 ఇంచెస్ ఫ్రంట్ మరియు 14 ఇంచెస్ రియర్ వీల్స్ పొందుతుంది. ఆర్12 నైన్‌టి బైకులో 17 ఇంచెస్ స్పోక్ వీల్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈ రెండూ అద్భుతమైన డిజైన్ పొందినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ యొక్క రెండు మోడళ్లలో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్, కీలెస్ ఇగ్నిషన్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఆర్12 నైన్‌టి బైక్ రెయిన్, రోడ్ మరియు స్టాండర్డ్ అనే రైడింగ్ మోడ్స్ పొందుతుంది. అయితే ఆర్ 12 ,మాత్రం రోల్ మరియు రాక్ అనే మోడ్స్ పొందుతుంది.

BMW R 12

ఈ రెండు కొత్త బైకులు 17 ఇంచెస్ వీల్స్ పొందుతాయి, ముందు వైపు 45 మిమీ USD ఫోర్క్ మరియు వెనుక వైపు పారలేవర్ స్వింగార్మ్‌ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందువైపు 310 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు ఒకే 265 మిమీ రోటర్ ఉన్నాయి. అదనంగా ఆప్షనల్ కంఫర్ట్ ప్యాకేజీ హిల్ స్టార్ట్ కంట్రోల్ ప్రో, షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో వంటివి కూడా ఇందులో లభిస్తాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, July 6, 2024, 11:04 [IST]
English summary
Bmw motorrad launches r12 and r12 ninet bikes in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+