BMW నుంచి ప్రీమియం బైక్ విడుదల.. ధర రూ.20.95 లక్షలు, ఫీచర్లు అదరహో
BMW మోటోరాడ్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ R 1300 GSని భారత్‌లో విడుదల చేసింది. ఈ బైక్ నాలుగు రైడింగ్ మోడ్‌లలో అందుబాటులో ఉండనుంది. వి ఎకో, రెయిన్, రోడ్, ఎండ్యూరో అనే రైడింగ్ మోడ్స్‌గా ఉన్నాయి. ఈ బైక్‌లో హిల్ స్టార్ట్ కంట్రోల్, బ్రేక్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ కంట్రోల్ వంటి అధునాతన ఉన్నాయి. కీలెస్ రైడ్, హీటెడ్ గ్రిప్స్ మరియు ఛార్జింగ్ స్లాట్‌తో సహా ఇతర ఫీచర్లు కూడా అందించబడతాయి. ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
బీఎండబ్ల్యూ మోటోరాడ్ సిరీస్‌లో ఈ బైక్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఈ R 1300 GSబైక్‌లో స్ట్రాంగ్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇందులోని 1,300cc, లిక్విడ్-కూల్డ్, బాక్సర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7,750rpm వద్ద 145bhp మరియు 6,500rpm వద్ద 149Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ స్ట్రాంగ్ ఇంజిన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉండనుంది.

ఈ బైక్ షాఫ్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ రూ. 20.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న R 1250 GS కంటే ఈ బైక్ ఖరీదు రూ. 40,000 ఎక్కువగా ఉంది. ఈ బైక్ హోండా ఆఫ్రికా ట్విన్ మరియు డుకాటి మల్టీస్ట్రాడా V4 లకు ప్రత్యర్థి బైక్‌గా ఉంది.
BMW R 1300 GS కాంపాక్ట్ బైక్ R 1250 GS కంటే 12 కిలోల తేలికైనది. కొత్త షీట్ మెటల్ మరియు తేలికపాటి ఇంజిన్ కారణంగా ఈ బురువు తగ్గింది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ గంటకు 225 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులోని స్పోర్టీ ఫీచర్లు రైడర్లకు మంచి అనుభూతిని అందిస్తుంది.

R 1300 GS మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి స్టైల్ ట్రిపుల్ బ్లాక్, స్టైల్ GS ట్రోఫీ మరియు 719 ట్రాముంటానాలుగా ఉన్నాయి. టాప్-స్పెక్ ఆప్షన్ 719 వేరియంట్‌లోని అదనపు ఫీచర్లలో మిల్డ్ ఎక్స్‌పాన్షన్ ట్యాంక్ మూత, షిఫ్ట్ మరియు ఫుట్ బ్రేక్ లివర్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు సర్దుబాటు చేయగల సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి. ఇంకా మరెన్నో అదనపు సెటప్‌లు ఈ బైక్‌లో పొందవచ్చు.
R 1300 GS కోసం బుకింగ్‌లు ఇప్పటికే ఆరంభం అయ్యాయి. త్వరలోనే డెలివరీలు కూడా చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నెలాఖరులో డెలివరీలు చేసే అవకాశం ఉంది. ప్రీమియం బైక్స్‌లో తాజాగా వచ్చిన ఈ బైక్ కస్టమర్లను కచ్చితంగా ఆకట్టుకుంటుందని సంస్థ భావిస్తోంది. అ భాగంగానే ఈ సరికొత్త బైక్‌పై ఆ సంస్థ భారీ ఆశలు పెంచుకుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








