సంచలన ధర వద్ద లాంచ్ అయిన BMW R 1300 GS - రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే!
గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) ఎట్టకేలకు భారతీయ విఫణిలో సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'ఆర్ 1300 జీఎస్' (R 1300 GS) లాంచ్ చేసింది. సెప్టెంబర్ 2023లో మొదటిసారి ఆవిష్కరించబడిన ఈ బైక్ ఇప్పుడు భారతదేశంలో లాంఛ్ అయింది. ఇది దాని అవుట్‌గోయింగ్ మోడల్ ఆర్ 1250 జీఎస్ ధరల కంటే ఎక్కువ. మార్కెట్లో విడుదలైన ఈ బైక్ ధర, డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ ప్రారంభ ధర రూ. 20.95 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది దాని మునుపటి మోడల్ ఆర్ 1250 జీఎస్ కంటే కూడా రూ. 40000 ఎక్కువ అని తెలుస్తోంది. ఈ బైకును ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి కంపెనీ ఈ నెలలోనే డెలివరీలు చేసే అవకాశం ఉంది.

కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ ముందు భాగం పూర్తిగా రీడిజైన్ చేయబడింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎల్ఈడీ డీఆర్ఎల్‍లతో కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ పొందింది. ఇది ఆర్1250 జీఎస్ కంటే సన్నగా కనిపిస్తుంది. విశాలంగా ఉండే ఫ్యూయెల్ ట్యాంక్ చూడవచ్చు. మొత్తం మీద ఈ బైక్ దృఢంగా, చూడగానే ఆకర్శించబడే డిజైన్ పొందినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇది హైట్ అడ్జెస్టమెంట్, కనెక్టెడ్ ఫీచర్‌లు మరియు 6.5 ఇంచెస్ ఫుల్లీ కలర్ TFT డిస్‌ప్లే, కీలెస్ ఇగ్నిషన్ వంటి వాటితో పాటు రెయిన్, రోడ్, ఎకో, ఎండ్యూరో అనే నాలుగు స్టాండర్డ్ రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఇది డైనమిక్, డైనమిక్ ప్రో మరియు ఎండ్యూరో ప్రో అనే మరో మూడు రైడింగ్ మోడ్స్ కూడా పొందనుంది.

కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ 1300సీసీ లిక్విడ్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 7750 rpm వద్ద 143.5 Bhp పవర్ మరియు 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది దాని మునుపటి మోడల్ ఆర్ 1250 జీఎస్ బైక్ కంటే కూడా 9 Bhp పవర్ మరియు 6 న్యూటన్ మీటర్ టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది.
సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన ఈ బైక్ అత్యద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందితుంది. ఇది లాంగ్ డ్రైవ్ చేయడానికి, కఠినమైన భూభాగాల్లో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 237 కేజీలు వట్రకు ఉంటుంది. అంతే కాకుండా ఇది అల్లాయ్ వీల్స్ లేదా స్పోక్డ్ రిమ్ పొందుతుంది. ఈ బైక్ తప్పకుండా అన్ని విధాలా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ కొత్త బైక్ యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ వంటి రాడార్ అసిస్టెడ్ సేఫ్టీ ఫీచర్‌లను పొందుతుంది. ఇది గ్రీన్/ఎల్లో పెయింట్ ఆప్షన్ పొందుతుంది. మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ డుకాటి మల్టీస్ట్రాడా వీ4 లైనప్, హార్లే డేవిడ్‌సన్ పాన్ అమెరికా 1250 స్పెషల్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








