వారెవ్వా.. బైక్ అంటే ఇలా ఉండాలి!.. దీని రేటెంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో అన్యదేశ్య బైకులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో బీఎండబ్ల్యూ మోటొరాడ్.. 'ఎస్ 1000 ఎక్స్ఆర్' పేరుతో ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ (BMW S 1000 XR) ధర రూ. 22.50 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఇండియా). ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా మనదేశానికి దిగుమతి అవుతుంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ప్రాక్టికాలిటీ అందిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ బైక్ ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నాము.

BMW S 1000 XR

కొత్త బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ బైక్ దాని మునుపటి మోడల్స్ నుంచి ప్రేరణ పొందటం వల్ల స్ప్లిట్ హెడ్‌లైట్‌ షార్ప్ ఫాసియాలో విలీనమై ఉంటుంది. ఈ బైక్‌లోని సీటు ట్రాక్ రైడింగ్ మరియు టూరింగ్‌కు ఖచ్చితంగా సరిపోయేలా రూపొందించారు. సీటు హైట్ కూడా 850 మిమీ వరకు తగ్గింది. కాబట్టి కొంత ఎత్తు తక్కువగా ఉన్న రైడర్లు కూడా సులభంగా రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ బైక్ 999 ఇన్ లైన్ 4 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఈ బైక్ 11000 ఆర్‌పిఎమ్ వద్ద 170 హార్స్ పవర్ మరియు 9250 ఆర్‌పిఎమ్ 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాని అవుట్‌గోయింగ్ మోడల్ కంటే 5 హార్స్ పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

BMW S 1000 XR Running Shot

బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ బైక్ కేవలం 3.2-సెకన్లలో గంటకు 0-1000 కిమీ వరకు వేగవంతం అవుతింది. దీని టాప్ స్పీడ్ గంటకు 253 కిమీ. ఈ బైక్ బ్లాక్ బీక్ ఫెండర్‌ కలిగి.. వెనుక భాగంలో కొత్త సైడ్ ప్యానెల్‌లు మరియు ఎయిర్ ఇన్‌టేక్‌ వంటి వాటిని పొందుతుంది. ఇది లైట్ వైట్, బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ మరియు గ్రావిటీ బ్లూ మెటాలిక్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ బైక్ కలర్ TFT డిస్ప్లే, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి వాటిని కూడా పొందుతుంది. కొత్త ఎస్ 1000 ఎక్స్ఆర్ బైక్ కోసం కంపెనీ టూరింగ్, డైనమిక్ మరియు ఎమ్ అనే ప్యాకేజీలను అందిస్తుంది. వీటిలో లభించే పరికరాలతో బైకును మరింత అందంగా డిజైన్ చేసుకోవచ్చు.

BMW S 1000 XR Side View

టూరింగ్ ప్యాకేజీలో లగేజ్ క్యారియర్, సెంటర్ స్టాండ్, నావిగేషన్ కోసం స్లాట్, హ్యాండ్ ప్రొటెక్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు హీటెడ్ గ్రిప్స్ వంటివి లభిస్తాయి. డైనమిక్స్ ప్యాకేజీలో డైనమిక్ ఈఎస్ఏ ప్రో, షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో మరియు క్రూయిజ్ కంట్రోల్‌.. ఎమ్ ప్యాకేజీలో స్పోర్ట్ సీటు, స్పోర్ట్స్ సైలెన్సర్, బ్లాక్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ మొదలైనవి లభిస్తాయి. వీటిని పొందటానికి కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 22, 2024, 10:35 [IST]
English summary
Bmw s 1000 xr launched in india at rs 22 50 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+