Bounce Infinity E1+ కొనుగోలుపై రూ.24000 తగ్గింపు - త్వరపడండి

బెంగళూరుకు చెందిన ఈవీ తయారీ సంస్థ 'బౌన్స్ ఇన్ఫినిటీ' తన E1+ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ తగ్గింపును ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు, ప్రస్తుతం ఈ స్కూటర్ ధర ఎంతనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

బౌన్స్ ఇన్ఫినిటీ సాధారణ ధర మార్కెట్లో రూ.1.13 లక్షలు. కానీ కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరింత ఎక్కువమంది కస్టమర్లకు చేరువ చేయడానికి ఏకంగా రూ. 24000 డిస్కౌంట్ ప్రకటించింది. అంటే ఈ ఆఫర్ తరువాత బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.89999 (ఎక్స్-షోషోరూమ్) మాత్రమే. ఈ ఆఫర్ వచ్చే నెల చివరి వరకు (2024 మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Bounce Infinity E1+

చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 85 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. కాబట్టి రోజువారీ వినియోగానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న సమయంలో కంపెనీ అందించిన ఆఫర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ ఈ రోజు నుంచి అమలులో ఉంటుంది, మార్చి 31 తరువాత అందుబాటులో ఉండకపోవచ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2kwh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇందులోని 2.2 kW ఎలక్ట్రిక్ మోటారు గరిష్టంగా 65 కిమీ/గం వేగాన్ని అందిస్తుంది. ఇది 15 Amp వాల్ సాకెట్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోగలదు.

Bounce Infinity E1+ Electric Scooter Gets Rs 24000 Price Cut

గ్రే, బ్లూ, గ్రీన్, డార్క్ గ్రే మరియు ఎల్లో కలర్ ఆప్షన్లలో లభించే ఈ బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ప్లస్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్, వెనుక భాగంలో ట్విన్ స్ప్రింగ్ షాక్ వంటి వాటి కలిగి డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. కావున ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగానే ఎప్పటికప్పుడు డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే కంపెనీ దేశ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన నగరాల్లో తన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. రానున్న రోజుల్లో కంపెనీ నెట్‌వర్క్‌ మరింత పెరుగుతుందని, మరిన్ని ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసి కస్టమర్లకు మరింత చేరువగా చేరుతుందని భావిస్తున్నాము.

సాధారణంగా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల మీద డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ ప్రకటించడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికే కొన్ని రోజులకు ముందు ఓలా ఎలక్ట్రిక్ కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇవన్నీ కూడా కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి మరియు తమ అమ్మకాలను పెంచుకోవడానికని స్పష్టమవుతోంది. అయితే తగ్గింపులు వల్ల ఎక్కువ మంది కస్టమర్లు ఆకర్శించబడతారు.

భారత దేశంలో గత కొన్ని రోజుల నుంచి దిగ్గజ వాహన తయారీ సంస్థలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాల మీద కనీవినీ ఎరుగని రీతిలో ఆఫర్స్ ప్రకటించాయి. పెద్ద మొత్తంలో ఆఫర్స్ ప్రకటించడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో బ్యాటరీ సెల్ ధరలు తగ్గడమే అని తెలుస్తోంది. నిజానికి ఎలక్ట్రిక్ వాహనం తయారీలో 40% బ్యాటరీలకే ఖర్చు అవుతుంది. వీటి మీద ఖర్చు తగ్గితే కంపెనీలు ఆఫర్స్ అందించడానికి వెనుకాడవు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, February 22, 2024, 16:27 [IST]
English summary
Bounce infinity e1 electric scooter gets rs 24000 price cut
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+