బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్‌తో రూ. 55,000 లకే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల
బెంగళూరుకి చెందిన బౌన్స్ ఇన్ఫినిటీ మార్కెట్‌లో సరికొత్త స్కూటర్‌ని ప్రవేశ పెట్టింది. ఈ స్కూటర్ బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. కొత్త బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ జూన్ నెల ఆరంభం నుంచి కొనుగోలుకి అందుబాటులోకి రానుంది. ఈ స్కూటర్ ప్రత్యేకతలు, ఫీచర్లు మరియు ఫర్ఫామెన్స్ వివరాలు మీకోసం..
బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ప్రస్తుతం అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వాటిలో ఇన్ఫినిటీ E1 ఒకటి. ఈ స్కూటర్‌కి కొనసాగింపుగా ఇన్ఫినిటీ ఈ1 ఎక్స్ పేరిట సరికొత్త స్కూటర్‌ని స్మార్ట్ అప్‌గ్రేడ్‌లతో విడుదల చేసింది. ఈ సంస్థకు బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాల్లో మంచి మార్కెట్ ఉంది. త్వరలోనే విడుదలయ్యే ఈ స్కూటర్ మంచి సేల్స్‌ని సాధించి పెట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. అందుకు తగినట్లుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తున్నాయి. ప్రారంభంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపని జనం తాజాగా ఈ కాలుష్య రహిత వాహనలకే ఓటేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ పంపుల మాదిరిగా ఛార్జింగ్ స్టేషన్లు లేవు. దీంతో వీటిని కొనేందుకు జనం కొద్దిగా వెనుకడుగు వేస్తున్నారు.
ఎక్కువ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పితే ఎలక్ట్రిక్ వాహనాలకు కొనేందుకు జనాలు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి బ్యాటరీ స్వాపింగ్ మరొక బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఉదాహరణకు ఇంట్లో ఎక్కువ సమయం ఛార్జింగ్ కోసం వేచి చూడకుండా నిర్ణీత కేంద్రానికి వెళ్లి ఛార్జ్ చేసిన బ్యాటరీని పొందవచ్చు.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఈ సంస్థ ఏర్పాటు చేసింది. కొత్త ఇన్ఫినిటీ E1X ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేసే కస్టమర్లు సమీప కేంద్రాల్లో బ్యాటరీని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ1ఎక్స్ మొత్తం 2 వేరియంట్లలో లాంచ్ అయింది. ఒకదాని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు మరొక స్కూటర్ గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. ఇది గరిష్టంగా గంటకు 92 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఈ స్కూటర్ విదేశాలకు సైతం ఎగుమతి చేసేలా సంస్థ అభివృద్ధి చేసింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్లను వ్యక్తులే కాకుండా కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవల బౌన్స్ ఇన్ఫినిటీ 30,000 ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేయడానికి సన్ మొబిలిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాన ఫుడ్ డెలివరీ, లాస్ట్ మైల్ డెలివరీ కంపెనీలతో పొత్తుల కోసం చర్చలు జరుపుతోంది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈవీ మార్కెట్‌ని తొలి స్థానంలో నిలిపేలా తమవంతు పాత్ర పోషిస్తామని ఆ కంపెనీ సీఈవో కో-ఫౌండర్ వివేకానంద హల్లెకరే వెల్లడించారు. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్‌తో పాటు ఉత్తమ ఫీచర్లను అందిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో బౌన్స్ ఈవీ తొందర్లో భారీగా బౌన్స్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కొత్త ఇ-స్కూటర్ ధర రూ.55,000 నుంచి రూ.59,000 మధ్య ఉంది. తాజాగా ఈ కంపెనీ లైనప్‌లోని వివిధ స్కూటర్ల ధరలను 21శాతం సంస్థ తగ్గించింది. ప్రస్తుతం ఈ కంపెనీ ముంబయి, బెంగళూరు, పూణె, హైదరాబాద్, ఢిల్లీలో స్కూటర్లను విక్రయిస్తుంది. వీటి ధరలు తగ్గడంతో ఎక్కువగా ఈ కంపెనీ స్కూటర్లను కొనేందుకు జనాలు ఆసక్చి చూపుతున్నారు.


Click it and Unblock the Notifications








