మార్కెట్లోకి అదిరిపోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌తో 200 కి.మీల పైనే.. ధర కూడా తక్కువే..

ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హావా నడుస్తుంది. గత ఏడాదితో పోలిస్తే, 2024లో ఈవీ బైక్స్, కార్లు, స్కూటర్లు పెద్ద ఎత్తున అమ్ముడుపోయాయి. రాబోయే కొత్త ఏడాదిలో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, 2025లో భారత ఈవీ మార్కెట్ ప్రపంచ దేశాల కంటే వేగంగా వృద్ధి చెందుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈవీలకు మంచి ఆధరణ లభిస్తుండటంతో తయారీదారులు తమ ఉత్పత్తిని పెంచి గతంలో కంటె అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ స్టార్టప్ కంపెనీ బ్రిస్క్(Brisk) ఈవీ మార్కెట్లో ఇతర కంపెనీలకు పోటీగా కొత్తగా ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు 'ఆరిజిన్ (origin)'. దీంతో బ్రిస్క్ ఈవీ కంపెనీ దేశంలో ఇప్పటికే మంచి మార్కెట్ కలిగిన ఏథర్, ఓలా కంపెనీలకు టఫ్ ఫైట్ ఇవ్వనుంది.

బ్రిస్క్ ఆరిజిన్ ఇ-స్కూటర్‌‌తో భారత ఈవీ మార్కెట్లో తయారీ కంపెనీల మధ్య పోటీ రసవత్తరంగా మారబోతుంది. ఆరిజిన్ ధర కూడా మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1,39,000 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్న వారు ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. దీని కోసం వినియోగదారులు రూ.333 చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీలను త్వరలో ప్రారంభిస్తారు.

Origin Electric Scooter

బ్రిస్క్ ఆరిజిన్ 4.5 కిలోవాట్(kWh) బ్యాటరీని కలిగి ఉంటుంది. పూర్తి ఛార్జింగ్‌తో 200 కి.మీల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 94 కి.మీగా ఉంది. ఆరిజిన్ కేవలం 3.6 సెకన్లలో 0 నుండి 40 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 3.3 kW పీక్ పవర్, 160Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. హెడ్‌లైట్ స్పోర్టీ స్టైల్‌తో కనిపిస్తుంది. ఫ్లాట్ ఫుట్ బోర్డ్, LED టైల్‌లైట్ వంటివి కూడా అధునాతనంగా ఉన్నాయి. అల్లాయ్ ఫ్రంట్ ఫుట్-పెగ్‌లు, ఇంకా గ్రాబ్ రైల్ వంటి ఫీచర్లను కూడా దీనిలో అందించారు. సీటు క్రింది భాగంలో ఎక్కువ లగేజీని పెట్టుకోవడానికి 30-లీటర్ ఖాళీ ప్లేస్ ఉంటుంది. రిజిన్ ఇ-స్కూటర్ డజన్ల కొద్దీ స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Brisk Origin New Ev Scooter Price

ముఖ్యంగా ఇది ఆండ్రాయిడ్ సపోర్ట్‌ కలిగిన 7-అంగుళాల టచ్ స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. పార్కింగ్ ఏరియాల్లో భారీ సంఖ్యలో ఉన్న వాహనాల మధ్య ఆరిజిన్‌ను గుర్తించడానికి రిమోట్‌ యాక్సెస్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా USB ఛార్జర్‌, స్మార్ట్ డిస్‌ప్లేలో అందించిన మ్యాప్‌ల ద్వారా నావిగేషన్ సపోర్ట్‌తో అడ్రస్ తెలియని ప్రాంతాలకు నేరుగా వెళ్లవచ్చు. మంచి రైడింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి ఇది రివర్స్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

బ్రిస్క్ ఆరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓషన్ గ్రీన్, పాంథర్ బ్లాక్, స్కార్లెట్ రెడ్, స్టార్మ్ గ్రే, మిస్టిక్ బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రైడర్ల రక్షణకు సంబంధించి కూడా హైదరాబాద్ బ్రిస్క్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్ సెటప్‌ను ఇచ్చింది. అదనంగా కాంబి-బ్రేక్ సిస్టమ్‌ను కూడా ఇచ్చారు. గుంతల్లో సాఫీ ప్రయాణానికి మోనో షాక్ సస్పెన్షన్ సెటప్‌‌ను అందించారు.

Hyderabad Brisk Origin Electric Scooter

అధునాతన ఫీచర్లతో వచ్చిన బ్రిస్క్ ఆరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి ఆరిజిన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ.333 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, December 26, 2024, 16:22 [IST]
English summary
Brisk origin electric scooter launched at rs 139000
Read more on: #electric scooter #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+