లోకల్ కంపెనీలకు ముచ్చెమటలే.. ఇండియాలో అడుగుపెట్టిన ఇంటర్నేషనల్ బ్రాండ్.. వార్ మామూలుగా ఉండదు

ఇండియాలో టూవీలర్ల వాడకం విపరీతంగా పెరిగింది. సాధారణ బైకులతో పాటు సూపర్ బైక్‌లకు సైతం డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో విదేశీ కంపెనీలు తమ వాహనాలను ఇక్కడికి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు అధునాతన ఫీచర్లతో సూపర్ బైకులను లాంచ్ చేయగా, ఇప్పుడు కొత్తగా ఆస్ట్రియాకు చెందిన బ్రిక్స్టన్ మోటార్‌సైకిల్స్(Brixton Motorcycles)దేశంలో అడుగుపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిక్స్టన్ నాలుగు మోడళ్లతో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. దానికి అనుగుణంగా ఇప్పుడు తన మోడళ్లకు బుకింగ్‌లను ఓపెన్ చేసింది. దీని రాకతో లోకల్‌గా ఉన్న కంపెనీలకు గట్టీ పోటీ ఎదురుకానుంది. వీటి డిజైన్ కూడా అదిరిపోయే విధంగా ఉండటంతో ఇంటర్నేషనల్ కంపెనీకి లోకల్ కంపెనీలకు మధ్య వార్ తప్పేలా లేదు.

కంపెనీ క్రాస్‌ఫైర్ 500ఎక్స్, క్రాస్‌ఫైర్ 500ఎక్స్‌సి, క్రోమ్‌వెల్ 1200, క్రోమ్‌వెల్ 1200ఎక్స్ మోడళ్లను నవంబర్‌లో విడుదల చేస్తుంది. ఇవి చూడటానికి స్టైలీష్‌గా ఉన్నాయి. ఈ బ్రాండ్ బైకులు విదేశాల్లో బాగా ఫేమస్. కస్టమర్‌లు ఏదైనా మోడల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే రూ.2,999 చెల్లించి ఆన్‌లైన్‌లో బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.

Brixton Motorcycles Crossfire 500x

ఇండియాలో తన మార్కెట్‌ను విస్తరించడానికి కంపెనీ పూణె, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోయంబత్తూర్,ముంబై, థానే, నాసిక్, చెన్నై,ముంబై, థానే, నాసిక్, చెన్నైతో సహా 13 నగరాల్లో షోరూమ్‌లను తెరవాలని నిర్ణయించింది. అమ్మకాలు పెరిగే కొద్ది ఇతర నగరాలకు కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా వచ్చే ఏడాది 50 స్టోర్లను తెరిచేందుకు రెడీగా ఉంది.

బ్రిక్స్టన్ మోటార్‌సైకిల్స్ నుంచి వస్తున్న నాలుగు మోడళ్ల ఫీచర్లు అద్భతుంగా ఉన్నాయి. క్రాస్‌ఫైర్ 500ఎక్స్(Crossfire 500X), క్రాస్‌ఫైర్ 500ఎక్స్‌సీ(Crossfire 500XC)రెండు కూడా బలమైన 500cc ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో వస్తున్నాయి. ఇవి 8,500rpm వద్ద 46 bhp పవర్‌ను 4,350rpm వద్ద 43 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

Brixton Motorcycles New Bikes In India

500cc ఇంజిన్‌తో వస్తున్న ఈ మోడళ్లలో కఠిన పరిస్థితుల్లో సైతం సులభంగా ప్రయాణించేలా బలమైన టైర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో సైతం సాఫీగా వెళ్లేలా సస్పెన్షన్ కస్టమర్లు ఊహించని విధంగా ఉంటాయని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తుంది. నగర ప్రాంతాల్లోని రోడ్లపై దీనిపై వెళ్తుంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది.

అలాగే, క్రోమ్‌వెల్ 1200(Cromwell 1200), క్రోమ్‌వెల్1200 ఎక్స్(Cromwell 1200X)రెండు మోడళ్లు 1200cc ట్విన్-సిలిండర్ భారీ ఇంజిన్ ఆప్షన్‌తో వస్తున్నాయి. ఇంత లెవల్ సీసీ సెగ్మెంట్‌లో రావడం అంటే మామూలు విషయం కాదు. వీటి పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందని తెలిసిపోతుంది. ఇవి 6,500 rpm వద్ద 82 bhp పవర్‌ను, 3,100 rpm వద్ద 108 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

Brixton Motorcycles Cromwell 1200

1200cc ఇంజిన్‌‌ను కలిగి ఉన్న క్రోమ్‌వెల్ మోడళ్లు, దేశీయ కంపెనీలకు చెందిన సూపర్ బైకులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. ఈ రేంజ్‌లో సీసీ అంటే దీని పనితీరు మాములుగా ఉండేలా లేదు. సాధారణ 450cc అంటేనే లాంగ్‌ రైడ్‌లకు అలాగే, లగ్జరీ ఫీలింగ్‌ను అందిస్తుంది. అలాంటిది 1200cc ఇంజిన్‌ బైకును రోడ్డుపై డ్రైవింగ్ చేస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం. అన్ని రకాల రోడ్లపై ఇవి సాఫీగా ప్రయాణిస్తాయి.

బ్రిక్స్టన్ మోటార్‌సైకిల్స్ నుంచి ప్రస్తుతం వస్తున్న ఈ మోడళ్లు, ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే, కంపెనీ నాలుగు బైకులను ఆస్ట్రియన్ డిజైన్ సెంటర్‌లో రూపొందించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తయారీ ప్లాంట్‌ను వీటి ఉత్పత్తి చేస్తుంది. వీటి ధరల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Brixton Motorcycles Begins Bookings New Bikes

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2024, 14:25 [IST]
English summary
Brixton motorcycles has opened bookings for new bikes in india
Read more on: #india #diwali #auto
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+