వాహన ప్రియులారా.. సిద్ధమా! చరిత్ర సృష్టించడానికి బీఎస్ఏ బైక్ వచ్చేస్తోంది

ప్రతి ఏటా భారత స్వాతంత్య్ర దినోత్సవం (ఆగష్టు 15) సందర్భంగా దేశీయ విఫణిలో కొత్త వాహనాలు లాంచ్ అవుతాయి. ఈ సారి కూడా కొత్త వాహనాలు లాంచ్ కావడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందిలో ఒకటి 'బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650' (BSA Gold Star 650). ఈ బైక్ ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా లాంచ్ అవుతుంది. భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్‌కు ప్రధాన ప్రత్యర్థిగా నిలబడనున్న కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ గురించి తప్పకుండా ఓ ఐదు విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కథనంలో ఆ విషయాలను వివరంగా తెలుసుకుందాం.

డిజైన్

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ బైక్ అనేది ఆధునిక రెట్రో మోటార్‌సైకిల్. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ చూసేవారికి ఇది 1980 నాటి రెట్రో మోటార్ సైకిల్ మాదిరిగా కనిపించవచ్చు. అయితే ఇది ఆధునిక హంగులను.. చిన్న కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కొన్ని మెకానికల్ బిట్‌లు కూడా అప్డేట్ చేయబడి ఉంటాయి.

BSA Gold Star 650

ఫీచర్స్

విడుదలకు సిద్దమైన కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఎల్సీడీ డిస్‌ప్లే, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్, యూఎస్బీ ఛార్జర్, ఎల్ఈడీ టెయిల్ లాంప్ మరియు హెడ్లాంప్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీ వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ వివరాలు

కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ 652 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్సీ 4 వాల్వ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6000 rpm వద్ద 44.27 Bhp పవర్ మరియు 4000 rpm వద్ద 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

BSA Gold Star 650 Front View

సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సెటప్

దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుకవైపు 5 స్టెప్ ఫ్రీ లోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. 320 మిమీ డిస్క్ బ్రేక్ (ముందు వైపు), 255 మిమీ డిస్క్ బ్రేక్ (వెనుక వైపు) ఉన్నాయి. ఇవన్నీ చాలా ఖచ్చితంగా పనిచేసేలా ఉంటాయి.

లాంచ్ మరియు అంచనా ధర

కంపెనీ ఈ కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ బైకును ఆగష్టు 15న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఒకప్పుడు భారతీయ మార్కెట్లో సంచలనం సృస్టింగ్ ఈ బైక్ మళ్ళీ మార్కెట్లో అడుగుపెట్టడం మంచి శుభవార్త. ఈ బైక్ కోసం వాహన ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ బైక్ ధర రూ.3 లక్షల నుంచి రూ.3.30 లక్షల మధ్య ఉంటుందని అంచనా. అయితే ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

BSA Gold Star 650 Front

దేశీయ మార్కెట్లో ఆగష్టు 15న మరిన్ని బైకులు కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే విక్రయాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని సమాచారం. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ఎప్పుడు స్వీకరిస్తుందని అనే.. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, August 5, 2024, 9:10 [IST]
English summary
Bsa gold star 650 bike launch on 15th august and top things to know
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+