మన తాతల కాలం నాటి 'BSA గోల్డ్ స్టార్' బైక్ మళ్లీ వచ్చేసింది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి గట్టి పోటీ!
BSA గోల్డ్ స్టార్ 650 మోటార్‌సైకిల్ (BSA GoldStar 650) భారతదేశంలో నేడు అధికారికంగా విడుదల అయ్యింది. ఈ మోటార్‌సైకిల్ ఆధునిక క్లాసిక్ మోడల్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ బ్రాండ్‌ను భారతదేశంలోని మహీంద్రా గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (CLPL) భారత్‌లో ప్రవేశపెట్టింది. BSA మోటార్‌సైకిల్ బ్రాండ్ కోసం CLPL మరో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఈ బైక్‌ని విడుదల చేశారు. ముఖ్యంగా 1970లో ఈ బైక్స్ మార్కెట్‌లో పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించాయి. దాదాపు 50 సంవత్సరాల తర్వాత అదే క్లాసీ లుక్‌తో ఇండియన్ మార్కెట్‌లో విడుదల అయ్యింది.
ఈ బైక్ కేవలం రూ .2,99,990 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైంది. ఈ కొత్త మోటార్ సైకిల్ నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ మోటార్‌సైకిల్ లైనప్‌తో పోటీపడుతుంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైక్స్ మాదిరిగానే రెట్రో థీమ్ మోటార్ సైకిల్‌గా ఉంటుంది. అంతేకాక ఈ మోటార్ సైకిల్ 1980ల నాటి బైక్‌ని పోలినట్లు రూపొందించడంలో బీఎస్‌ఏ సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

దూరం నుంచి కొత్త బిఎస్ఎ గోల్డ్ స్టార్ 650 అచ్చం పాత మోటార్ సైకిల్‌ని పోలినట్లు ఉంటుంది. ఇది మంచి రాయల్ లుక్‌ని అందించనుంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 LCD డిస్ప్లే, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్, యుఎస్బి ఛార్జర్, LED టెయిల్ల్యాంప్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇది 650 సీసీ మోటార్ సైకిళ్ల మాదిరిగా సమాంతర-ట్విన్ ఇంజిన్‌తో కాకుండా సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గోల్డ్ స్టార్ 650 లోని ఈ 652 సీసీ, DOHC యూనిట్ 6,000 rpm వద్ద 45 bhp శక్తిని మరియు 4,000 rpm వద్ద 55 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ మాదిరిగా కాకుండా బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 మోటార్ సైకిల్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ 5-స్పీడ్ గేర్ బాక్స్ పట్టణ పరిస్థితులలో అలాగే కఠినమైన రోడ్లలోనూ పవర్‌ట్రెయిన్‌కి సరిపోతుందని మేము ఆశిస్తున్నాము. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో 5-స్టెప్ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లను కలిగి ఉంది.
ఇందులో బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 255 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి. అలాగే దీని బైక్ ముందు భాగంలో 18 అంగుళాల చక్రాలు, వెనుక భాగంలో 17 అంగుళాల చక్రాలను కలిగి ఉంది. ఈ స్పోక్డ్ వీల్స్ ముందు భాగంలో 100/90 సెక్షన్ టైర్లు మరియు వెనుక భాగంలో 150/70 సెక్షన్ టైర్లతో చుట్టబడి ఉంటాయి.

ఇది 12-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. ఈ గోల్డ్ స్టార్ 650 బైక్ బరువు 213 కిలోలుగా ఉంది. అయితే ఇది కొంచెం బరువుగా అనిపించవచ్చు కానీ ఇది తక్కువ 780 మిమీ సీటు ఎత్తుతో వస్తుంది కాబట్టి బ్యాలెన్సింగ్ సులువుగానే ఉండనుంది. అయితే ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో వచ్చే కొన్ని ఫీచర్లను కోల్పోతుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








