రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌ కథ కంచికే.. 50's-60'sలో మార్కెట్‌ని శాసించిన బైక్ మళ్లీ వస్తుంది!!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ కొత్త BSA (Birmingham Small Arms) 650 సీసీ బైక్‌ని ఆగస్టు 15న భారతదేశంలో ఆవిష్కరించనుంది. దేశంలో ఈ కంపెనీ జావా మరియు యెజ్డీ మోటార్‌ సైకిళ్ల ఉత్పత్తిని కలిగి ఉంది. ఈ క్లాసిక్ లెజెండ్స్ నుంచి త్వరలో రాబోయే కొత్త బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ 650 ట్విన్ మోడళ్లకు పోటీగా నిలువనుంది. దీనిని గోల్డ్ స్టార్ 650 అని పిలిచే అవకాశం ఉంది. క్లాసిక్ లెజెండ్స్ నుంచి రాబోయే ఈ బైక్‌ 50's మరియు 60's క్లాసిక్‌ మోడళ్ల వలె ఉండే విధంగా డిజైన్‌ చేశారు. ఈ బైక్‌కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న కీలక వివరాలు మీకోసం..

ఈ మోడల్‌ని భారత్‌లో విడుదల చేయడం ద్వారా తమ మార్కెట్‌ని మరింత విస్తరించాలని క్లాసిక్‌ లెజెండ్స్‌ కంపెనీ భావిస్తోంది. ఈ బైక్‌ని ప్రారంభ ధర రూ. 3 లక్షలు నుంచి 4.50 లక్షల మధ్య తీసుకువచ్చే అవకాశం ఉంది. క్లాసిక్ లెజెండ్స్ నుంచి రాబోయే ఈ బైక్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టార్‌ 650కు పోటీగా ఉండనున్నాయి. BSA గోల్డ్ స్టార్ 650 పవర్‌ట్రైయిన్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టార్‌ 650ని పోలి ఉంటుంది.

BSA-Goldstar-650-Unveil

ఈ బైక్‌ 652 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, DOHC 4 వాల్వ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 44.27 bhp పవర్ మరియు 4,000 rpm వద్ద 55 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ముందువైపు 41 mm టెలిస్కోపిక్ ఫోర్క్ వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.

బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ మరియు వెనుక 255 మిమీ డిస్క్‌తో వస్తుంది. డ్యూయల్- ABS ఛానల్ ఫీచర్‌తో పాటు బైక్ ముందు భాగంలో 18 అంగుళాల చక్రాలు, వెనుక భాగంలో 17 అంగుళాల చక్రాలు ఉన్నాయి. ఈ బైక్‌ రెట్రో లుక్‌తో పాటు LCD డిస్ప్లే, స్లిప్పర్ క్లచ్, USB ఛార్జర్, LED టెయిల్‌ల్యాంప్‌ వంటి ఫీచర్లతో మోడ్రన్ బైక్‌గా రానుంది.

BSA-Goldstar-650-Unveil-On-August-15

గుండ్రని ఇంధన ట్యాంక్, హెడ్‌లైట్ మరియు వెడల్పాటి హ్యాండిల్‌బార్‌తో కూడిన ఫ్లాట్ సీటుతో పాటు టియర్-డ్రాప్ ఆకారపు యూనిట్ డిజైన్ ఆకట్టుకోనుంది. ఈ క్లాసిక్ బైక్‌కి ఆధునిక హంగులు జోడించి ఫ్యాషన్‌ లుక్‌లో ఈ మోటార్‌సైకిల్ నేటి యువతకు అనుగుణంగా ఉండేలా రూపొందించారు. క్లాసిక్ లెజెండ్స్ దేశంలోని యూత్‌ని కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.

ఒక్కసారి మార్కెట్‌లోకి అడుగుపెట్టాక బ్రాండ్‌ వ్యాల్యూ కచ్చితంగా పెరుగుతుందని కంపెనీ తెలిపింది. అందుకే భారత్‌ స్వాతంత్ర్య పొందిన రోజున భారతీయ ప్రేక్షకుల కోసం బైక్‌ ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ బ్రాండ్‌తో ఇతర మార్కెట్‌లకు చెక్‌పడే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ బైక్‌ లుక్‌ అదిరిపోయిందంటూ యువత కామెంట్స్‌ చేస్తున్నారు.

BSA-Gold-Star-650-Bike

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.డడడడచజ

More from DriveSpark

Article Published On: Monday, June 24, 2024, 19:09 [IST]
English summary
Bsa gold star 650 to be unveiled in india on august 15 full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+