మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.999 చెల్లించి హాయిగా తిరగవచ్చు!

దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఉన్న క్రేజ్‌తో చాలా వరకు కొత్త స్టార్టప్‌ కంపెనీలు స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. స్కూటర్‌ మార్కెట్‌లో కింగ్‌మేకర్‌గా ఉన్న హోండా మోటార్‌సైకిల్‌ ఇండియా కూడా ఇటీవలె ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని లాంచ్‌ చేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న యాక్టివా స్కూటర్‌ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వస్తుండటంతో ఈ సెగ్మెంట్‌ని శాసించే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో వినియోగదారులకు ఏప్రిల్‌ 2025 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొత్త బ్రాండ్స్‌ సైతం ఈ రంగంలో రాణించేందుకు ఉవ్విలూరుతున్నాయి. అందులో భాగంగానే కొత్త మోడళ్లను కూడా ప్రవేశపెడుతున్నాయి.

తాజాగా దేశీయ ద్విచక్ర వాహన స్టార్టప్ లెక్ట్రిక్స్ ఈవీ (Lectrix EV) తాజాగా ఎండ్యూరో (Nduro) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది. ఈ లెక్ట్రిక్స్ ఎండ్యూరో ఎలక్ట్రిక్ స్కూటర్ సరసమైన ధరలో అద్భుతమైన డిజైన్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎండ్యూరో 2.0, ఎండ్యూరో 3.0 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Lectrix Nduro Electric Scooter Launch

ఈ స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధర వరుసగా రూ.84,999, రూ.94,999గా ఉన్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, రేంజ్‌తో అందుబాటులోకి రావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఈ రెండు వేరియంట్లు రెండు వేరు వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో లభిస్తాయి. బ్యాటరీ వద్దను కుంటే తక్కువ ధరకే ఈ స్కూటర్‌ని కొనుగోలు చేయవచ్చు. దీంతో కస్టమర్లకు డబ్బు ఆదా కానుంది.

బ్యాటరీపై ఆసక్తి లేని వారు బ్యాటరీ లీజ్ ఆప్షన్ కింద ఎండ్యూరో 2.0 వేరియంట్‌ని కేవలం రూ.57,999 లకే కొనుగోలు చేయవచ్చు. దీని బ్యాటరీ లీజు సబ్‌స్క్రిప్షన్‌ నెలకు రూ .999 నుంచి ప్రారంభమవుతుంది. దీనివల్ల ఎక్కువ అవసరం లేని వినియోగదారులకు ఈ స్కూటర్‌ సరిపోతుంది. ఈ ఎండ్యూరో ఈవీ స్కూటర్ల బుకింగ్స్ డిసెంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.

దీని డిజైన్‌ కూడా సరికొత్తగా ఉంది. ముందు భాగంలో బోల్డ్ ఫ్రంట్ ఆప్రాన్‌ షార్ప్ లుక్‌ని కలిగి ఉంది. ఢిఫరెంట్‌ లుక్‌లో ఆల్-LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్‌ కలదు. ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లను హెడ్‌లైట్ కౌల్ పై అందించారు. ఇది కచ్చితంగా యువతను ఆకర్షిస్తుంది. అంతే కాకుండా దీనిలో 42 లీటర్ల బూట్ స్పేస్‌ని అందించారు. అందువల్ల ఎక్కువ లగేజీని క్యారీ చేయవచ్చు.

ఇందులో భారీ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్‌లో 5 ఇంచెస్‌ కలర్ LCD స్క్రీన్, టాప్-ఎండ్‌లో 5 అంగుళాల TFT స్క్రీన్‌ని అందించారు. దీనిని మొబైల్ యాప్ కనెక్టివిటీ ద్వారా రైడ్ అనలిటిక్స్, బ్యాటరీ స్టేటస్ అప్డేట్స్ పొందవచ్చు. ఇక ఇందులో సేఫ్టీ ఫీచర్లు కూడా ఎక్కువే ఉన్నాయి. రెండు వేరియంట్లలో హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, థెఫ్ట్ అలర్ట్స్ , సైడ్-స్టాండ్ కటాఫ్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్కూటర్లు 2.3 కిలోవాట్, 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తాయి. 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే లెక్ట్రిక్స్ ఎండ్యూరో 2.0 వేరియంట్ ఫుల్‌ ఛార్జ్‌పై 90 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇక 3.0 మోడల్ 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ సింగిల్‌ ఛార్జ్‌పై 117 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. రెండు వేరియంట్లలో 2.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ జతచేయబడింది.

ఈ స్కూటర్లు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5.1 సెకన్లలో 40 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఈ లైనప్స్‌ రాకతో సేల్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని SAR గ్రూప్‌ భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా వరకు స్టార్టప్‌ కంపెనీలు ప్రధాన తయారీదారులకు గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం.

More from DriveSpark

Article Published On: Friday, December 6, 2024, 11:01 [IST]
English summary
Lectrix nduro electric scooter launched check range and specifications here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+