పూణెలో ఉత్సాహంగా CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ రేస్.. మొదటి రౌండ్‌లో విజేతలు వీరే.!!
మహారాష్ట్రలో పూణెలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ రేస్ అట్టహాసంగా జరిగింది. అతి పెద్ద గ్రౌండ్‌లో 10,000 మంది ప్రేక్షకులను అంతర్జాతీయ ఛాంపియన్‌లు మరియు వర్ధమాన భారతీయ తారలు ఉత్సాహ పరిచారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
BB రేసింగ్ కోసం రేసింగ్‌లో పాల్గొన్న ఫ్రాన్స్‌కు చెందిన జోర్డి టిక్సియర్ 450cc అంతర్జాతీయ రేసులో మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే బిగ్‌రాక్ మోటార్‌స్పోర్ట్‌కు చెందిన ఆస్ట్రేలియన్ రైడర్ రీడ్ టేలర్ 250cc అంతర్జాతీయ ఛార్జీకి నాయకత్వం వహించగా.. బిగ్‌రాక్ మోటార్‌స్పోర్ట్‌లో భాగమైన థాయ్‌లాండ్‌కు చెందిన థానరత్ పెన్జన్ 250సీసీ ఇండియా-ఆసియా మిక్స్ విభాగంలో గెలుపొందడం ద్వారా జట్టును విజయతీరాలకు చేర్చడంలో దోహదపడ్డాడు.

ISRL యొక్క సీజన్ 1 అంతర్జాతీయ రైడర్‌ల ఆకట్టుకునే శ్రేణిని కలిగి ఉండటంతో పాటు ఇక్కడ నాలుగు విభాగాల్లో పోటీపడగల భారతీ ప్రతిభావంతులను కలిగి ఉండటం చెప్పుకోదగినది. ఆ నాలుగు కేటగిరీల్లో 450cc ఇంటర్నేషనల్, 250cc ఇంటర్నేషనల్, 250cc ఇండియా-ఆసియా మిక్స్ మరియు 85cc జూనియర్ క్లాస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి రైడర్‌లతో, లీగ్ సూపర్‌క్రాస్ ఆధిపత్యం ప్రదర్శించింది.

కాగా ISRL అన్ని వయసుల మరియు నైపుణ్య స్థాయిల రైడర్‌లకు సురక్షితమైన మరియు పోటీ వాతావరణాన్ని అందించింది. పూణే ఈవెంట్ విజయవంతం కావడంతో సహ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ వీర్ పటేల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పుణె ప్రేక్షకుల నుండి తమకు లభించిన స్పందన చూసి సంతోషిస్తున్నట్లు చెప్పారు. భారత కేంద్రంగా, ప్రపంచానికి సూపర్ క్రాస్ పాయింట్‌గా CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్(ISRL) నిలిచిందన్నారు.
పూణె ఈవెంట్ విజయవంతం కావడంతో తదుపరి రేసింగ్ ISRL అహ్మదాబాద్ మరియు ఢిల్లీలో జరగనుంది. ఫిబ్రవరి 11న అహ్మదాబాద్‌లోని EKA ఎరీనా, ట్రాన్స్‌స్టాడియాలో తన తదుపరి రౌండ్‌కు సిద్ధంగా ఉంది. ఉత్కంఠభరితమైన తొలి సీజన్‌కు ముగింపుగా ఫిబ్రవరి 25న న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో గ్రాండ్ ఫినాలేను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భారతదేశంలో క్రీడా రంగం భవిష్యత్తుకు CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ ఎంతగానో దోహదపడుతుందని డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయపడుతోంది. బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యం, భద్రతకు ప్రాధాన్యతనివ్వడం, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఈ రేసింగ్ లీగ్ ద్వారా భారత్‌లో యువ క్రీడాకారుల ప్రతిభ, సామర్థ్యాలు ప్రపంచానికి తెలియనున్నాయి.

బిగ్‌రాక్ మోటార్‌స్పోర్ట్ అద్భుతమైన పనితీరు.. పోటాపోటీగా, ఉల్లాసంగా సాగుతున్న ఈ ఉత్తేజకరమైన సీజన్‌కు వేదికగా నిలవడం హర్ణణీయం. కాగా రాబోయే మరో రెండు రేసుల్లోనూ, అభిమానులు మరింత థ్రిల్‌ను పొందవచ్చు. కాగా మొదటి ISRL ఛాంపియన్‌ల కిరీటం ఎవరిదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే..

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








