Creatara EV concepts: సింగిల్ ఛార్జింగ్ తో 100 కి.మీ రేంజ్.? క్రియేటారా మొబిలిటీ ఈవీ కాన్సెప్ట్ విడుదల.. !
క్రియేటారా మొబిటిలీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ తన ఈవీ కాన్సెప్ట్‌ను (creatara unveiled EV concepts) విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీకి చెందిన వికాస్ గుప్తా మరియు రింగ్లేరి పామీ ఈ సంస్థను స్థాపించారు. ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ ఇన్ఫోవేషన్ పార్క్‌లో వాహన కాన్సెఫ్ట్‌లు VS4 మరియు VM4 లను ఆవిష్కరించింది.
భద్రత, అధునాతన సాంకేతికత : క్రియేటారా మొబిలిటీ ఇ - స్కూటర్లు భద్రత, అధునాతన సాంకేతికతను అందించడం ద్వారా పట్టణ ప్రయాణాన్ని మెరుగుపరుస్తాయని సంస్థ తెలిపింది. మరియు భద్రతా సమస్యలకు పరిష్కరించేందుకు క్రియేటోరా సెక్యూర్ బూట్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో వస్తుంది.

క్రియేటారా 3.7 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుందని సంస్థ తెలిపింది. మరియు 100 kmph గరిష్ఠ వేగాన్ని అందుకోగలవని సంస్థ తెలిపింది. 4 నుంచి 5 గంటల్లో ఈవీలు ఛార్జింగ్ చేయవచ్చని చెప్పారు. 100 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. మరియు మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ల సెన్సార్లు, జీపీఎస్ ట్రాకింగ్ రైడర్‌కు భద్రత కల్పిస్తుంది. వీటి ద్వారా రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని సంస్థ తెలిపింది.
క్రియేటరా సంస్థ కాన్సె్ప్ట్ వాహనం నడిపేందుకు కనీస రైడర్ బరువు అవసరం అని తెలుస్తోంది. ఈ పాసివ్ బ్యాటరీ ప్యాక్ కూలింగ్ సిస్టమ్ వేడెక్కే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది. ఈ కాన్సెప్ట్ వాహనాలు ఆవిష్కరణ సందర్భంగా సంస్థ సీఈవో వికాస్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు.

క్రియేటరా ఈవీ : ఈ వాహనాలు ప్రస్తుత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటాయని సంస్థ తెలిపింది. పెరుగుతున్న ఇంధన ధరలు మరియు కాలుష్య ప్రభావం మరియు ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి కారణాలతో క్రియేటరా వాహనాలను మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
* ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, విక్రయం, ఈ రంగంలోని ఉద్యోగ అవకాశాలపై ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి సుమారుగా కోటి ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లో విక్రయించనున్నట్లు వెల్లడించారు. దేశంలో సుమారు 5 కోట్ల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పారు.

ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్ నిలుస్తుందని గడ్కరీ ఇప్పటికే చాలా వేదికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతోపాటు భారత్‌కు అవసరమైన వాహనాలను తయారుచేసుకొనే సామర్థ్యం దేశానికి ఉందని చెప్పారు.
పెట్రోల్/ డీజిల్ ముడిచమురు దిగుమతులను తగ్గించుకొనేందుకు ప్రభుత్వం కూడా అనేక ప్రణాళికలు రచిస్తోంది. ఈ వాహనాల స్థానంలో ప్రత్యామ్నాయ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తనవంతు సాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు రాయితీలు అందిస్తోంది. వాహన్ పోర్టల్ సమాచారం ఆధారంగా దేశంలో ఇప్పటి వరకు 34.54 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ చేయబడ్డాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








