క్వాంటమ్‌ ఎనర్జీ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు.. రూ. 10,000కు పైగా డిస్కౌంట్‌తో ఇప్పుడే ఇంటికి తెచ్చుకోండి.!!

కొత్త స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. దేశంలో ప్రముఖ టూ వీలర్‌ తయారీదారు క్వాంటమ్‌ ఎనర్జీ.. తన ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకువచ్చింది. వీటిపై ఏకంగా రూ. 10 వేల చొప్పున డిస్కౌంట్లను అందిస్తూ ముందుకొచ్చింది. మరి ఏయే స్కూటర్లపై ఏయే ఆఫర్లు ఉన్నాయి.. ఈ కథనంలో..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూలంగా ఉండటంతో పాటు ఫ్యూయెల్‌ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రజలకు ఎక్కువగా ఈవీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి అనేక మోడళ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు పుట్టుకొచ్చాయి. ఈవీ రంగంలో ప్రముఖ ఆటో కంపెనీల కంటే కూడా స్టార్టప్‌లో సత్తా చాటుతున్నాయి.

Quantum-Energy-Offers-On-Plasma-X-And-XR

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు క్వాంటమ్ ఎనర్జీ కృషి చేస్తోంది. కాగా క్వాంటమ్ ఎనర్జీ రీసెర్చ్ మరియు అభివృద్ధి కేంద్రం హైదరాబాద్‌లోనే ఉంది. కాగా ఇప్పుడు క్వాంటమ్ ఎనర్జీ తన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ప్లాస్మా ఎక్స్(Quantum Plasma X) మరియు ఎక్స్‌ఆర్‌(XR) లిమిటెడ్‌ ఆఫర్లను ప్రకటించింది.

క్వాంటమ్ ఎనర్జీ ప్లాస్మా ఎక్స్ మరియు ఎక్స్ఆర్ ఇ స్కూటర్ మోడళ్ల ధరలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాగా Plasma X ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,19,525 గా ఉంది. ఇప్పుడు రూ.1,09,000 వెచ్చించి ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు.

Quantum-Energy-Offers-On-Plasma-X-And-XR

ఇక మార్కెట్లో రూ.99,757 ధరలో అందుబాటులో ఉన్న XR E Scooter పై 10 శాతం తగ్గింపుతో రూ.89,000కు కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ ఆఫర్లు 31 మార్చి 2024 వరకు మాత్రమే వర్తిస్తాయి. రైడర్లకు మెరుగైన, సౌకర్యవంతమైన ఎకో ఫ్రెండ్లీ రైడింగ్‌ అనుభవాన్ని అందించేలా ఈ స్కూటర్లను రూపొందించినట్లు Quantum Energy వెల్లడించింది.

ఇక ప్లాస్మా X ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికొస్తే.. ఇది శక్తివంతమైన 1500W మోటార్‌తో పనిచేస్తుంది. ఇందులో 60V 50Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ దూరం రేంజ్‌ ఇస్తుంది.

Quantum-Energy-Offers-On-Plasma-X-And-XR

గరిష్ఠంగా గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణిస్తుండగా.. ప్లాస్మా X కేవలం 7.5 సెకన్లలో సున్నా నుంచి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. కీలెస్ స్టార్ట్ మరియు రివర్స్ గేర్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. రైడర్లు ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు డ్రైవ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు.

ఇక ప్లాస్మా XR ఎలక్ట్రిక్ స్కూటర్‌.. 1500W మోటార్ ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ పై 100 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. అర్బన్‌ వాసులకు రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఈ స్కూటర్లు ఉంటాయని సంస్థ చెబుతోంది.

ఆసక్తిగల కస్టమర్‌లు క్వాంటమ్ ఎనర్జీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా షోరూమ్‌లను సందర్శించడం ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం టెస్ట్ రైడ్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కాగా ప్రతి క్వాంటమ్‌ ఎనర్జీ షోరూమ్.. విక్రయాలు, సేవ మరియు విడిభాగాల కోసం సమగ్ర 3S సెంటర్లు పనిచేస్తాయి.

ఈ నేపథ్యంలో ఇటీవలే క్వాంటమ్ ఎనర్జీ తన షోరూమ్‌ని హర్యానాలోని గురుగ్రామ్‌లో ప్రారంభించగా.. రాష్ట్రంలోనే తొలి క్వాంటమ్‌ ఎనర్జీ షోరూమ్‌ ఇదే కావడం విశేషం. దీంతో దేశంలో తమ విక్రయాల నెట్‌వర్క్‌లో షోరూమ్‌ల సంఖ్యను సంస్థ 62కి పెంచుకుంది. స్కూటర్ల విక్రయంతో పాటు ReadyAssistతో భాగస్వామ్యం ద్వారా 24X7 రోడ్‌సైడ్ సహాయాన్ని కూడా ఈ సంస్థ అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, March 11, 2024, 17:35 [IST]
English summary
Discounts above rs 10 000 on quantum energy e scooters plasma x and xr limited period offer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+