డ్రైవ్‌స్పార్క్‌ బైకింగ్‌ కమ్యూనిటీ.. రోడ్డు భద్రత కోసం మీరూ మాతో చేరండి.!!

ప్రజల్లో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించేందుకు మా డ్రైవ్‌స్పార్క్‌ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బైకింగ్ కమ్యూనిటీని ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతోంది. అంతేకాకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. కాగా రైడింగ్‌ ఔత్సాహికుల కోసం మా డ్రైవ్‌స్పార్క్‌.. ఓ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అదేంటంటే..

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల్లో మన భారత్‌ ఒకటి. దీన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నప్పటికీ మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారు నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే.. రోడ్డు భద్రతా నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

DriveSpark-Biking-Community

దీన్ని దృష్టిలో ఉంచుకుని, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు మా డ్రైవ్‌స్పార్క్ బృందం బైక్ రైడింగ్ ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. ఇందుకోసం డ్రైవ్‌స్పార్క్ ప్యాషనేట్ బైక్ రైడర్‌ల కోసం బైకింగ్ కమ్యూనిటీని సృష్టించింది. డ్రైవ్‌స్పార్క్ బైకింగ్ కమ్యూనిటీ యొక్క మొదటి రైడ్ మార్చి 17వ తేదీ ఆదివారం బెంగళూరులో ఘనంగా నిర్వహించారు.

త్వరలో ప్రపంచవ్యాప్తంగా మా డ్రైవ్‌స్పార్క్‌(DriveSpark Biking Community).. ఓ కొత్త బైకింగ్‌ కమ్యూనిటీని ఏర్పాటు చేయనుంది. రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు ఈ కమ్యూనిటీలో భాగమే పార్టిసిపేట్‌ చేయవచ్చు. కాగా ఇప్పటికే మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌.. ఇటీవల బ్రేక్‌ఫాస్ట్‌ రైడ్‌ను సైతం నిర్వహించి అందర్నీ ఆకట్టుకుంది.

ఈ ఏడాది మార్చి 17 న మా DriveSpark యొక్క బెంగుళూరు చాప్టర్ బైకింగ్ కమ్యూనిటీ ప్రారంభోత్సవ బ్రేక్‌ఫాస్ట్ రైడ్‌(Inaugural Breakfast Ride)ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో 13 మంది ఉత్సాహభరితమైన రైడర్‌లు పాల్గొని.. రోడ్డు భద్రత అవగాహనలో పాల్గొన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇండియన్, BMW, హార్లే డేవిడ్‌సన్, బజాజ్, కవాసకి మరియు KTM వంటి ప్రఖ్యాత బ్రాండ్‌లతో ఈ రైడ్‌ ఉత్సాహభరితంగా సాగింది. 350cc నుంచి 1650cc వరకు ఇంజిన్ సామర్థ్యాలను కలిగి ఉన్న విభిన్న శ్రేణి మోటార్‌సైకిళ్లు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా ప్రత్యేక బ్యాకప్ వాహనం సహాయంతో రైడర్లు కలిసి మొత్తం 125 కి.మీ దూరం ప్రయాణించారు.

బెంగళూరుతో పాటు మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌.. చెన్నై, కోయంబత్తూర్, మధురై, కొచ్చి, ముంబై మరియు మలేషియాలో కూడా కొత్త చాప్టర్లను ఏర్పాటు చేశాం. ఇందుకోసం మేము వివిధ ప్రాంతాల్లోని రైడర్‌ల నుండి అభ్యర్థనలను కూడా స్వీకరించాము. దేశవ్యాప్తంగానే కాకుండా రాబోయే రోజుల్లో నేపాల్, భూటాన్, మేఘాలయ, జర్మనీ, ఇటలీ, సింగపూర్ ఇంకా శ్రీలంకలో కొత్త చాప్టర్లను ఏర్పాటు చేయబోతున్నాం.

ఆసక్తి గల రైడింగ్‌ ఔత్సాహికులు మా డ్రైవ్‌స్పార్క్‌ బైకింగ్‌ కమ్యూనిటీలో భాగస్వాములు కావచ్చు. ఇందుకోసం కింద అందించిన ఫారమ్‌లో అవసరమైన సమాచారాన్ని పూర్తి చేయండి. Submit చేసిన తర్వాత, మీరు డ్రైవ్‌స్పార్క్ కమ్యూనిటీలో చేరడానికి సంబంధిత WhatsApp లింక్‌ పంపబడుతుంది. దీని ద్వారా, బైక్ రైడింగ్ ట్రిప్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లను పొందవచ్చు.

Form Link: https://surveyheart.com/form/65fc522149cec872d08e5930

More from DriveSpark

Article Published On: Friday, March 22, 2024, 11:36 [IST]
English summary
Drivespark has established biking community to raise awareness about road safety worldwide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+