డుకాటి నుంచి స్ట్రీట్‌ఫైటర్ V4 బైక్ లాంచ్.. ధర రూ. 24 లక్షలు
భారత మార్కెట్లో మరో కొత్త స్ట్రీట్ ఫైటర్ విడుదలైంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటీ(Ducati).. తన స్ట్రీట్‌ఫైటర్ V4 మోటార్‌సైకిల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఖరీదైన సూపర్ స్టైలిష్, ఈ స్ట్రీట్ ఫైటర్ బైక్ ఫీచర్లు, డిజైన్ పూర్తి సమాచారం ఈ కథనంలో..
ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ మోటార్‌సైకిల్ కంపెనీలలో డుకాటీ ఒకటిగా ఉంది. భారత మార్కెట్లో కూడా ఈ సంస్థ బైక్‌లకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో డుకాటీ కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన Mi23 స్ట్రీట్‌ఫైటర్ బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది. స్ట్రీట్‌ఫైటర్ V4 అనేది ప్రసిద్ధ డుకాటీ పానీ V4 బైక్‌కి నేక్డ్ వెర్షన్‌గా ఉంటుంది.

డుకాటి భారత మార్కెట్లో 2024 స్ట్రీట్‌ఫైటర్ V4 లైనప్‌ను V4, V4 S అనే రెండు వేరియంట్‌లలో లాంచ్ చేసింది. ఈ రెండు బైక్‌లు షైనీ డుకాటీ రెడ్ పెయింట్ కలర్‌లో లభిస్తుండగా, V4 S ఎడిషన్‌లో గ్రే నీరో కలర్ ఆప్షన్‌లో కూడా ఉంది.
'ఫ్లైట్ ఫార్ములా' కాన్సెప్ట్ ఆధారంగా.. డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 బైక్‌ను సంస్థ రూపొందించింది. కాగా.. మొదటి డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 బైక్ 2020లో లాంచ్ అయింది. లాంచ్ తర్వాత ఈ బైక్‌కు ప్రపంచవ్యాప్తంగా యువ రైడర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో అప్‌డేటెడ్ స్ట్రీట్‌ఫైటర్ V4 బైక్‌ను సంస్థ తీసుకువచ్చింది.

డిజైన్ విషయానికొస్తే డుకాటి స్ట్రీట్ ఫైటర్ V4 బైక్ ముందు భాగంలో పూర్తి LED లైట్లను అమర్చారు. V- ఆకారంలో DRL లను అందించారు. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 16.5 లీటర్లు. కొత్త స్ట్రీట్‌ఫైటర్ V4 S బైక్ ముదురు బూడిద రంగులో నిగనిగలాడే ఫినిషింగ్ టచ్‌తో వస్తుంది.
కొత్త స్ట్రీట్‌ఫైటర్ V4 బైక్‌లో కొత్త వెట్ రైడింగ్ మోడ్‌ను ఒక కీలక ఫీచర్‌గా వస్తుంది. జారే రోడ్లపై కూడా ఈ రైడింగ్ మోడ్ ద్వారా మంచి పట్టుతో నడపవచ్చు. ఇక హ్యాండిల్‌బార్ మధ్యలో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్ ఖరీదైన డుకాటి పానీ V4 బైక్ నుంచి తీసుకున్నారు.

డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 బైక్‌లో ఈ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్ 'ట్రాక్ ఎవో' అనే డిస్‌ప్లే మోడ్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే మోడ్‌లో, మీరు MotoGPలో ఉపయోగించిన Ducati బైక్ స్క్రీన్ లేఅవుట్‌ను చూడవచ్చు. అలాగే, ఈ కొత్త బైక్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్ ద్వారా రైడర్లు ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. వీటితో పాటు, బైక్‌కు గేర్ షిఫ్టింగ్‌ను సూచించడానికి గ్రీన్ ఎల్‌ఈడీ సిగ్నల్‌ను కూడా అందిస్తుంది.
డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి4 బైక్‌లో 1,103సీసీ డెస్మోసిడిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 13,000 rpm 208 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 123 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ విషయానికొస్తే.. డుకాటి స్ట్రీట్ ఫైటర్ V4 బైక్ కొత్త ఇంజిన్.. బ్రేక్ కంట్రోల్ ఈవో 2 సాఫ్ట్‌వేర్ మెరుగైన స్టెబిలిటీ మరియు బ్రేకింగ్ పనితీరును అందిస్తుంది.
అంతేకాకుండా ఈ బైక్‌ను అక్రాపోవిక్ ఫుల్-రేసింగ్ ఎగ్జాస్ట్ పైపుతో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ తేలికపాటి ఎగ్జాస్ట్ పైపుతో సంప్రదాయ ఎగ్జాస్ట్ పైపును భర్తీ చేయడం ద్వారా మీరు గరిష్టంగా 220 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇప్పటికే పలు దేశాల్లో ప్రారంభం కాగా.. తాజాగా భారత్‌లో లాంచ్ అయింది.
కొత్త 2023 డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి4 బైక్‌ను సంస్థ.. రూ. 24,62,400 ఎక్స్-షోరూమ్ ధరతో ప్రవేశపెట్టింది. ఇక టాప్ స్పెక్ వేరియంట్ V4 S ను రూ. 27.80 లక్షలు మరియు రూ. 28 లక్షలతో లాంచ్ చేసింది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.


Click it and Unblock the Notifications








