దడపుట్టించే ధర వద్ద లాంచ్ అయిన Ducati కొత్త బైక్ ఇదే!.. వివరాలు

ఇండియన్ మార్కెట్లో సరసమైన బైకులు మాత్రమే కాకుండా.. అత్యంత ఖరీదైన బైకులు కూడా లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డుకాటీ తన 'డెసర్ట్ఎక్స్ ర్యాలీ'ను లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

డుకాటీ కంపెనీ యొక్క డెసర్ట్ఎక్స్ ఇప్పటికే అత్యుత్తమ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ బైకుల జాబితాలో ఒకటిగా పేరుతెచ్చుకుంది. దీంతో కంపెనీ ఇప్పుడు దీని ఆధారంగా డెసర్ట్ఎక్స్ ర్యాలీ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 23.7 లక్షలు (ఎక్స్ షోరూమ్). అంటే ఈ బైక్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 5.4 లక్షలు ఎక్కువని తెలుస్తోంది.

Ducati DesertX Rally

కొత్త డుకాటీ డెసర్ట్ఎక్స్ ర్యాలీలో గమనించదగ్గ ప్రత్యేకమైన ఫీచర్ దాని సస్పెన్షన్. అంతే కాకుండా ఈ బైక్ 48 మిమీ USD ఫోర్క్ మరియు మోనోషాక్ పొందుతుంది. మొత్తం మీద ఈ బైక్ యొక్క ముందు భాగంలో 250మిమీ సస్పెన్షన్ మరియు వెనుకవైపు 240 మిమీ ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా 20 మిమీ ఎక్కువని తెలుస్తోంది. కాబట్టి మంచి ఆఫ్ రోడింగ్ అనుభూతిని పొందవచ్చు.

డుకాటీ డెసర్ట్ఎక్స్ ర్యాలీ యొక్క సస్పెన్షన్ మాత్రమే కాకుండా సీటు హైట్ కూడా పెరిగింది. కాబట్టి సీటు ఎత్తు 875 మిమీ నుంచి 910 మిమీ చేరింది. కంపెనీ ఈ బైక్ యొక్క ఆఫ్ రోడింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి బిల్లెట్ అల్యూమినియం హబ్‌లతో కూడిన వైర్ స్పోక్ రిమ్‌లను అందిస్తుంది. రిమ్‌లు ట్యూబ్‌లెస్ టైర్‌లకు బదులుగా ట్యూబ్ టైప్ టైర్‌లతో అమర్చబడి ఉంటాయి.

Ducati DesertX Rally

ట్యూబ్ టైప్ టైర్‌లను కలిగి ఉండటం వల్ల రైడింగ్ చేసే సమయంలో డుకాటీ డెసర్ట్ఎక్స్ ర్యాలీకు తక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇది చూడటానికి డెసర్ట్ఎక్స్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో కొత్త పెయింట్ స్కీమ్ (రెడ్ అండ్ వైట్ కలర్ కలయిక) చూడవచ్చు. కాబట్టి రైడింగ్ సమయంలో గీతలు పడినా తక్కువగా కనిపిస్తాయి. మొత్తం మీద ఇది రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

కొత్త డుకాటీ డెసర్ట్ఎక్స్ ర్యాలీ బైక్ బరువు దాని మునుపటి మోడల్ కంటే కూడా ఒక కేజీ ఎక్కువ. కాబట్టి దీని బరువు 211 కేజీల వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21లీటర్లు. ఈ బైక్ బరువు ఫుల్ ట్యాంక్ ఇంధనం ఉన్నప్పుడు 225 కేజీల వరకు ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం రైడింగ్ చేయడానికి అనుమతిస్తుంది.

Ducati DesertX Rally

ఇంజిన్ విషయానికి వస్తే.. డుకాటీ డెసర్ట్ఎక్స్ ర్యాలీలో ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి అదే 937 సీసీ ఎల్-ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9250 rpm వద్ద 108 Bhp పవర్ మరియు 92 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మల్టిపుల్ లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్‌లు, ఏబీఎస్ మోడ్‌లు పొందుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, May 3, 2024, 12:59 [IST]
English summary
Ducati new bike desertx rally launched at rs 23 7 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+