100 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఆవిష్కరణ.. ఫుల్‌ ఛార్జింగ్‌కి కేవలం 3 గంటలు మాత్రమే పడుతుంది

దేశంలో ఎలక్ట్రిక్‌ మార్కెట్‌పై కంపెనీలు దృష్టి సారించాయి. అందులో భాగంగానే అధిక రేంజ్‌తో పాటు స్మార్ట్ ఫీచర్లతో స్కూటర్లను పోటా పోటీగా విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈవీ ఔత్సాహికులు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఇ-బైక్ గో (eBikeGo)ఎలక్ట్రిక్‌ ఇటీవల ఆవిష్కరించింది. వినూత్న ఫీచర్లతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మువి 125 5జీ (Muvi 125 5G)ని బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ఆవిష్కరణ చేశారు.

తైవాన్‌కి చెందిన మల్టీ హార్డ్‌వేర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఏసర్ (Acer) భాగస్వామ్యంతో భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌ ఇ-బైక్ గో ఈ స్కూటర్‌ని తయారు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మువి 125 4జీ ఈ స్కూటర్‌ రిప్లేస్‌ చేయనుంది. అతి తక్కువ ధరలో స్పీడ్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌తో ఈ స్కూటర్‌ని తీసుకువచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీ కోసం..

Ebikego-Muvi-123-5G

మువి 125 5జీ డిజైన్ దేశీయ భూభాగంలో తిరిగేలా రూపొందించారు. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడానికి పెటాబైట్ డేటాతో దీనిని తయారు చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ శక్తివంతమైన 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్‌ని ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్లకు పైగా పరిధిని అందిస్తుందని సంస్థ తెలిపింది.

బ్యాటరీ ప్యాక్ అభివృద్ధిలో ఇ-బైక్ గో లోతైన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించినట్లు వెల్లడించింది. ద్విచక్ర వాహన మార్కెట్లో అత్యాధునిక మరియు అధిక-పనితీరు గల బ్యాటరీ వ్యవస్థకు ఇది దోహదపడుతుందని సంస్థ పేర్కొంది. ఇది స్టాండర్డ్ ఓవర్ నైట్ ఛార్జింగ్ సొల్యూషన్స్ కంటే చాలా వేగవంతమైనదిగా ఉంది.

Ebikego-Muvi-123-5G-Unviel

మొబైల్ యాప్ కనెక్టివిటీతో పాటు స్మార్ట్ ఎల్ఈడీ డిజిటల్ డిస్ప్లే డ్యాష్‌బోర్డ్‌ని కలిగి ఉంది. ఇది రైడర్లకు అంతరాయం లేని కనెక్టివిటీ అనుభవాన్ని అందిస్తుంది. సాంప్రదాయ పెట్రోల్ స్కూటర్ల కంటే మరింత విశ్వసనీయమైన మరియు సమర్థవంతమైనదిగా ఈ స్కూటర్‌‌గా దీనిని భావిస్తున్నారు. దీని ధర ఇంకా ప్రకటించబడలేదు. అయితే త్వరలోనే ఈ-బైక్ గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రకటించే అవకాశం ఉంది.

ఈ స్కూటర్‌ని హోండా యాక్టివా మరియు యమహా ఫాసినో వంటి ఐసిఇ స్కూటర్లకు పోటీగా భావిస్తున్నారు. ఓలా ఎస్ 1 ఎక్స్, ఏథర్ 450 మరియు TVS ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్ల కంటే తక్కవ ధరకే (దాదాపు రూ. లక్ష వరకు) మాత్రమే ఉండే అవకాశం ఉంది. పర్యావరణ అనుకూల రవాణా ప్రత్యామ్నాయాలను సృష్టించడానికి కంపెనీ తీసుకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని రవిశంకర్ చెప్పారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను 100,000 యూనిట్లకు పెంచే ప్రణాళికతో కంపెనీ ముందుకు సాగుతుంది. గత మూడేళ్లలో కంపెనీ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో మంచి మార్కెట్‌ని ఏర్పాటు చేసుకోగలిగింది. దీంతోపాటు ద్వితీయ శ్రేణి పట్టణాలకు కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ-బైక్ గోక్ ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకు సైతం ఇస్తుంది. రాబోయే కాలంలో ఈ మార్కెట్‌ని మరింత వేగవంతం చేయాలని భావిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, June 28, 2024, 14:57 [IST]
English summary
Ebikego electric unveils new muvi 125 5g scooter ranging 100 km full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+