ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పెట్రోల్‌ స్కూటర్లలో ఏది కొంటే బెటర్? డబ్బులు సేవ్‌ చేసేది ఏంటంటే?

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఇవి అత్యంత లాభదాయకంగా, పర్యావరణ హితంగా ఉండటంతో జనాలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీలు, పన్ను ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. అయితే పెట్రోల్ (ఐసీఈ) ద్విచక్ర వాహనాలు ఇప్పటికీ భారత్‌లో టాప్‌లో కొనసాగుతున్నాయి. అయితే దీనికి కారణం జనాలు వీటికి అలవాటు పడటమే అని చెప్పాలి.

ప్రస్తుతం ఓ వైపు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతుండగా.. మరోవైపు ప్రజలు ఎక్కువగా ఐసీఈ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఏది మంచిది? దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈ కథనంలో చూడబోతున్నాము. పూర్తి స్థాయిలో లాంగ్ లైఫ్‌ అందించే స్కూటర్లు ఏవి? వాటి వల్ల ఏ మేరకు లాభాలు ఉంటాయనే అంశాలకు సంబంధించిన వివరాలపై కథనంలో స్పష్టత ఇవ్వబోతున్నాం.

Electric-Scooters-Vs-Petrol-Scooters-Buying-Options

ఎలక్ట్రిక్‌ స్కూటర్ వర్సెస్ పెట్రోల్ స్కూటర్: ముందుగా మీరు ఒక రోజులో ఎంత దూరం ప్రయాణించగలరనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలి. అంటే మీరు కొనుగోలు చేయబోయే స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదో తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేయడం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే ఎక్కువ రేంజ్‌ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

అయితే పూర్తి ఛార్జ్‌పై ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్లను కొనుగోలు చేయడం ఉత్తమం. ఉదాహరణకు పూర్తి ఛార్జింగ్‌పై కనీసం 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయాలి. కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు ఎక్కువ రేంజ్ ఇచ్చే మోడల్, దాని ఛార్జింగ్‌ సమయం, బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్స్‌ వంటి వాటిని ఎంక్వైరీ చేశాకే కొనుగోలు చేయాలి.

Ampere-Magnus

ఇక పెట్రోల్ వాహనాలకు ఈ సమస్య ఉండదు. మీరు గ్యాసోలిన్‌ని ఎక్కడైనా క్షణాల్లో నింపవచ్చు. హైవేలపై కనీసం 50 కి.మీ ఒక పెట్రోల్‌ స్టేషన్‌ ఉంటుంది. అంత దూరం వరకు మీరు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు. కానీ ఎలక్ట్రిక్ వాహనం అలా కాదు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి చాలా గంటలు సమయం పడుతుంది.

ఇంకా దానిని ఎక్కడ ఛార్జ్ చేయాలనే ప్రశ్న ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెద్ద ఎత్తున పుంజుకుంటున్నాయి. కానీ ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఛార్జింగ్‌ స్టేషన్లు కూడా తగినన్ని లేవు. వీటిని నిర్మించేందుకు పూర్తి స్థాయిలో పలు కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జింగ్‌ స్టేషన్ల సదుపాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.

Ola-S1-X-Buy

ప్రస్తుతం కేవలం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ముమ్మరంగా పనులను నిర్వహిస్తున్నారు. అందువల్ల, ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి ముందు మీ ప్రాంతంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి స్థితిలో ఉందో లేదో తనిఖీ చేయడం మంచిది. ఈ విషయంలో పెట్రోల్ ద్విచక్రవాహనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడ తిరిగినా దేశంలో పెట్రోల్ బంకులు అందుబాటులో ఉంటాయి.

ఒకవేళ మీ దగ్గర్లో పెట్రోల్ బంకు లేకపోయినా మరో వాహనం తీసుకుని పెట్రోల్ కొనుగోలు చేసి నింపుకోవచ్చు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీలను పొందవచ్చు. కానీ ఈ స్టేషన్లు కూడా దేశంలో చాలా తక్కువ. ఇంకా ఈ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం చాలా ఉంది.

Pure-EV-Epluto

ఖర్చు: ఖర్చు విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్తమమైనవి. పెట్రోల్ ద్విచక్రవాహనం లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తే నేటి పెట్రోల్ ధరలతో పోలిస్తే కిలోమీటరుకు రూ.2 వరకు ఖర్చవుతుంది. కానీ కొన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కిలోమీటరు ప్రయాణించడానికి 50 పైసల కన్నా తక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కిలోమీటరు ప్రయాణాన్ని 10-20 పైసల వరకు అందిస్తున్నాయి.

నిర్వహణ వ్యయం: ఈ విషయంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలే ఉత్తమమైనవి. ఎందుకంటే, పెట్రోల్ స్కూటర్లకు మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆయిల్ ఛేంజ్, ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా చేయాల్సిన పని. లేకపోతే మీ వాహనం దెబ్బతింటుంది. పెట్రోల్ ద్విచక్రవాహనంలో ఇదే అతి పెద్ద ఖర్చుగా ఉంటుంది. ఇంజిన్ మరియు ఇతర ముఖ్యమైన భాగాల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది.

Bajaj-Chetak

ఇక ఎలక్ట్రిక్‌ స్కూటర్లు తక్కువ భాగాలను కలిగి ఉంటుంది. దీంతో ఎక్కువ నిర్వహణ అవసరం లేదు. అంచే కాకుండా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు గాలిని కలుషితం చేయవు. అందువల్ల ఇవి పర్యావరణ మిత్రుడిగా ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు జీరో ఉద్గారాలు విడుదల చేస్తాయి. కాబట్టి ఎటు చూసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్తమంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేయడం మంచిది.

More from DriveSpark

Article Published On: Sunday, July 28, 2024, 15:40 [IST]
English summary
Electric or petrol scooters which are good for buy full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+