ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న కొత్త టూ వీలర్లు ఏంటో తెలుసా.??.. కొత్త స్కూటర్ కొనేవారికి ఇక పండగే.!!
సోమవారం(ఏప్రిల్ 1) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కాబోతుంది. ఆ రోజు నుంచి మళ్లీ కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో విస్తృత మార్పులు చోటుచేసుకోనున్నాయి. రేపటితో FAME-2 సబ్సిడీ ముగుస్తుండటంతో.. ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరగనున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో పలు ఈవీ సంస్థలు కొత్త లాంచ్‌లు చేపడుతున్నాయి.
ఏథర్ రిజ్టా(Ather Rizta): ఓలాతో పాటు మార్కెట్లో ప్రజాదరణ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఏథర్ ఎనర్జీ. ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ భారత మార్కెట్లో 450 సిరీస్ స్కూటర్లను విక్రయిస్తోంది. కాగా ఏప్రిల్‌లో ఈ సంస్థ నుంచి ఫ్యామిలీ స్కూటర్ విడుదల కానుంది. ఏప్రిల్ 6న ఈ స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఏథర్ 450 ఒక పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే, కొత్త ఏథర్ రిజ్టా బడ్జెట్-ఫ్రెండ్లీ ఫ్యామిలీ స్కూటర్‌గా ఉంటుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. రిజ్టా స్కూటర్ ధరలు, టెక్నికల్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు అన్నీ.. ఏప్రిల్ 6న విడుదల కానున్నాయి. కాగా రిజ్టా స్కూటర్ బుకింగ్‌లను సంస్థ ఇప్పటికే ప్రారంభించింది.
ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్: గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కింద పనిచేస్తున్న ఆంపియర్(Ampere), తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ-స్కూటర్‌ను సంస్థ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు టెస్ట్ రైడ్ చేయడం ద్వారా సరికొత్త రికార్డును సృష్టించింది.

ఈ కొత్త ఆంపియర్ స్కూటర్ పనితీరును ప్రదర్శించడానికి సంస్థ ఈ సుదూర రైడ్‌ను చేపట్టింది. 2023 ఆటో ఎక్స్‌పోలో ఆంపియర్ ప్రదర్శించిన ఈ స్కూటర్ NXG కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ఏప్రిల్‌లో లాంచ్ అవుతుందనే సమాచారం ఉన్నప్పటికీ.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీని ఆంపియర్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
అల్ట్రావయొలెట్ ఎలక్ట్రిక్ బైక్: ఎలక్ట్రిక్ సూపర్ బైక్ తయారీదారుగా మార్కెట్‌లో స్థిరపడిన అల్ట్రావయొలెట్.. ఏప్రిల్ 24న కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎలాంటి ఎలక్ట్రిక్ బైక్ అవుతుంది.. దీని ధర, ఫీచర్లు ఏంటనే దానిపై సమాచారం అందుబాటులో లేదు.

భారత మార్కెట్లో అల్ట్రా వయొలెట్ నుంచి సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌ను ఆశించలేరు. ఎందుకంటే అల్ట్రా వయొలెట్ తనను తాను సూపర్ బైక్ బ్రాండ్‌గా ఉంచాలనుకుంటుంది. అయితే ఏప్రిల్ 24 న లాంచ్ కానున్న బైక్.. F77 ఎలక్ట్రిక్ బైక్‌కి కొత్త వేరియంట్ కావచ్చు లేదా F77 బైక్ యొక్క కొత్త స్పెషల్ ఎడిషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
BMW R1300 GS: BMW Motorrad యొక్క కొత్త ప్రీమియం అడ్వెంచర్ బైక్, R1300 GS, గత సంవత్సరం గ్లోబల్ మార్కెట్లో విడుదల అయింది. దీని తరువాత, ఈ సరికొత్త BMW బైక్ ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో విడుదల కానుంది. BMW R1250 GS బైక్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా R1300 GS బైక్‌ను తీసుకువచ్చారు.

అంటే, కొత్త R1300GS బైక్‌లో 1250cc ఇంజిన్‌కు బదులుగా, పెద్ద 1,300cc బాక్సర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. పెద్ద ఇంజన్ పరిమాణం ఉన్నప్పటికీ, బైక్ బరువు దాదాపు 12 కిలోలు తగ్గింది. కాగా ఈ జాబితాను బట్టి చూస్తే, ఈ ఏప్రిల్‌లో పెద్ద 2-వీలర్ లాంచ్ ఏమీ లేదు. విడుదల చేయనున్న 4 ద్విచక్ర వాహనాల్లో 3 ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి.


Click it and Unblock the Notifications








