ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కొనేవారు ఇది గుర్తుంచుకోండి.. లేదంటే కచ్చితంగా మోసపోతారు!

దేశంలోని ఎలక్ట్రిక్ టూవీలర్‌ విభాగంలో ఓలా (Ola Electric), టీవీఎస్ (TVS Motors)కి ఎక్కువ ఆదరణ ఉంది. ఈ కంపెనీకి చెందిన స్కూటర్లు మార్కెట్‌లో మంచి వాటాను కలిగి ఉన్నాయి. కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా తమ కంపెనీ లైనప్స్‌లో సరికొత్త స్కూటర్లు విడుదల చేస్తూ దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ స్కూటర్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో గుండె లాంటి కీలక బ్యాటరీల ధరలు స్కూటర్‌ మొత్తం ధరలో సగం లేదా అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. కావున కస్టమర్లు స్కూటర్లను కొనేముందు బ్యాటరీ ధరలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాకుండా వీటిపై ఉండే వారంటీని కూడా అడిగి తెలుసుకోవాలి లేదంటే మీ జేబులకు చిల్లులు పడటం ఖాయం. దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

గత ఏడాది ఓలా ఎలక్ట్రిక్‌ తమ స్కూటర్ల బ్యాటరీ ధరలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ఓలా S 1, S 1 ప్రో బ్యాటరీ ప్యాక్స్‌ ఇన్ వాయిస్‌తో షేర్‌ చేసింది. ఇందులో చూపిన ధర పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓలా S 1 2.98 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ధర రూ.66,549గా ఉంది.

Electric Scooters Battery Warranty

అదే విధంగా ఎస్1 ప్రో 3.97 కిలోవాట్ల ప్యాక్ ధరను రూ.87,298గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ బ్యాటరీల ధర రూ. 60 వేల నుంచి రూ. 70,000 వరకు ధర ఉంది. ఇక టీవీఎస్ విక్రయిస్తున్న ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఐక్యూబ్‌, ఐక్యూబ్‌ S, ఐక్యూబ్‌ ST వేరియంట్స్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.

దీనిలోని టాప్ మోడల్‌లో 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 145 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. సరికొత్త అప్‌డేట్స్‌తో ఈ స్కూటర్‌ని లిమిటెడ్ ఎడిషన్‌లోనూ ప్రవేశపెడుతుంది. అయితే వీటి బ్యాటరీ ప్యాక్ మార్చడానికి రూ. 56 వేల నుంచి రూ. 70,000 వరకు ఖర్చవుతుంది. ఎందుకంటే టీవీఎస్ మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీని మాత్రమే అందిస్తుంది.

Electric Scooters Batteries

అలాగే బజాజ్ చేతక్ వివిధ వేరియంట్లు, వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. ఇతర తయారీదారుల మాదిరిగానే, బజాజ్ కూడా తన స్కూటర్ బ్యాటరీలపై మూడు సంవత్సరాల వారంటీని అందిస్తోంది. బ్యాటరీ ఫెయిల్ అయినా, వారంటీ గడువు ముగిసినా రీప్లేస్ మెంట్ ఖర్చు కోసం రూ. 50,000 చెల్లించాల్సి ఉంటుంది. వారంటీ వ్యవధి దాటితేనే ఈ ఖర్చు అవుతుంది.

వాహనం మొత్తం ధరతో పోలిస్తే వీటి ధర ఎక్కువగా ఉండటం వల్ల, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు బ్యాటరీ ఖర్చులపై ఓ కన్నేయాలి. కావున మంచి టెక్నాలజీతో అందుబాటులో ఉన్న చౌకైన బ్యాటరీ ఆప్షన్‌ని ఎంచుకోవడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు వినియోగదారులు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

TVS iQube

అయితే మనలో చాలామంది పెట్రోల్ వెహికిల్స్‌ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారే సమయంలో పెట్రోల్‌ని, ఛార్జింగ్ ఖర్చును మాత్రమే పోల్చి చూస్తారు. కానీ పెట్రోల్‌ వెహికిల్‌లో ఇంజిన్‌ స్థిరంగా ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌లో కొంత కాలం తర్వాత బ్యాటరీని మార్చాల్సి ఉంటుందని చాలా మందికి తెలియదు. అందువల్ల మీకు ఏది లాభదాయకమో డిసైడ్‌ అయ్యే ముందు ధరల మధ్య వత్యాసాన్ని తెలుసుకోండి. ఇది ఫోర్‌వీలర్స్‌కి కూడా వర్తిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 20, 2024, 10:23 [IST]
English summary
Electric scooters battery price and warranty keep in mind before buying check all details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+