ఏప్రిల్ 1 నుంచి కొత్త సబ్సిడీ.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనటానికి ఇదే మంచి తరుణం!

భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024(EMPS) కారణంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ICRA) వెల్లడించింది.

నివేదికల ప్రకారం.. గతంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని పెంచడానికి ప్రవేశపెట్టిన ఫేమ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అయితే ఆ పథకం ఈ నెల 31 (మార్చి 31) నాటికి ముగియనున్నట్లు సమాచారం. కాబట్టి రాబోయే రోజుల్లో (2024 ఏప్రిల్ 1) ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ధరలు ఏకంగా 10 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనాలనుకునే వారికి పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

Ampere Primus

భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలనీ ఎలక్ట్రిక్ టూ వీలర్ మరియు త్రీ వీలర్స్ కోసం మొత్తం రూ. 500 కోట్లు కేటాయించారు. కాబట్టి సబ్సిడీ అనేది ఇప్పుడు ఇప్పుడు రూ. 10000/kWh నుంచి రూ. 5000/kWh వరకు తగ్గింది.

దీంతో ఒక్కో వాహనం మీద గరిష్టంగా రూ. 10000 ప్రయోజనం మాత్రమే లభిస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ICRA) ప్రకారం.. ఫేమ్ 2 ఫ్రేమ్‌వర్క్ కింద ఐదేళ్లతో పోల్చినప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు తిరిగి చెల్లించే వ్యవధి 5.5 సంవత్సరాలకు పొడిగించవచ్చని తెలుస్తోంది. దీని ద్వారానే ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు కూడా కస్టమర్లకు సబ్సిడీ వంటివి అందిస్తుందని సమాచారం.

Hero Electric

భారతదేశంలో టెక్నాలజీ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగటానికి ప్రధాన కారణం ఇంధన ఖర్చులను తగ్గించడమనే తెలుస్తుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరిగే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

2025 నాటికి 6 నుంచి 8 శాతం..

కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం వంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన వినియోగం 5 శాతంగా ఉంది. ఇది 2025 నాటికి 6 నుంచి 8 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఐసీఆర్ఏ అంచనా వేస్తోంది.

TVS iQube

ఇక రాబోయే కొత్త నిబంధల వల్ల దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు గణనీయంగా పెరుగుతాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కంపెనీల అమ్మకాల మీద ప్రభావం చూపిస్తాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ధరలు ఎక్కువ కావడం వల్ల కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారా? లేదా.. అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 20, 2024, 15:00 [IST]
English summary
Electric scooters price hike from 1 april 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+