పెట్రోల్‌ లేదా ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌లో ఏది కొంటే బెటర్‌..? మెయిన్‌ తేడాలు చూసి డిసైడ్‌ అవ్వండి!!

దేశంలో టూ-వీలర్‌ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో సాంప్రదాయ పెట్రోల్‌ టూ-వీలర్స్‌తో పాటు ఎలక్ట్రిక్‌ బైక్స్‌ లేదా స్కూటర్లను కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్, పెట్రోల్ టూవీలర్స్‌ మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. పెట్రోల్‌ టూ-వీలర్స్‌తో పాటు ఎలక్ట్రిక్‌ సేల్స్‌ అదే మొత్తంలో దూసుకెళ్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పర్యావరణ కాలుష్యం తగ్గించే విధంగా ఉండటంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండింటిలో ఏ టూవీలర్స్‌ని కొనుగోలు చేయాలి? ఏది కొంటే ఖర్చులు తగ్గుతాయి? ఏది ఎక్కువ లైఫ్‌ని ఇస్తాయనే విషయాన్ని ఇక్క మేము వివరించబోతున్నాం..

మొదటగా పెట్రోల్ స్కూటర్ల విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు బేసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.70,000 నుంచి రూ.1,20,000 మధ్య ఉంటుంది. కొన్ని ప్రీమియం స్కూటర్ల ధర ఎక్కవ ఉండే అవకాశం ఉంటుంది. పెట్రోల్ స్కూటర్లు సాధారణంగా రూ.60,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంటాయి. ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో పోల్చితే వీటి ధర తక్కువ అని చెప్పవచ్చు.

Electric-Vs-Petrol-Two-Wheelers-Differences

అయితే పెట్రోల్ స్కూటర్లకు రెగ్యులర్ పెట్రోల్ ఫిల్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.100గా ఉంది. రోజువారీ చొప్పున పెట్రోల్‌ కోసం కచ్చితంగా లీటర్‌ కంటే ఎక్కువే పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ నెలవారీ ఇంధన ఖర్చు గణనీయంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పెట్రోల్‌తో పోలిస్తే ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువ.

పెట్రోల్ టూ వీలర్స్‌లో బయటి పార్ట్స్‌ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మెయింటైనైన్స్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ స్కూటర్లలో పార్ట్స్‌ తక్కువగా ఉంటాయి. దీంతో నిర్వహణ వ్యయం ఖర్చు తక్కువగా ఉంటుంది. పెట్రోల్ స్కూటర్లకు క్రమం తప్పకుండా ఆయిల్ మార్పులు లేదా ఇంజిన్ సర్వీసింగ్‌ చేయించాల్సి ఉంటుంది. ఇది అదనపు ఖర్చుగా ఉంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు ఇన్ని ఖర్చులు ఉండవు.

Electric-Vs-Petrol-Two-Wheelers

ప్రస్తుతం మీరు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌పై భారత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ ప్రోత్సాహకాలు ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. పెట్రోల్‌ టూవీలర్స్‌ కొనేవారికి ఎలాంటి సబ్సిడీలు లభించవు. దీంతో మీరు షోరూంలో డీలర్‌ అందించే డిస్కౌంట్‌ని తప్పా తక్కువ ధరకు స్కూటర్లను కొనుగోలు చేయలేరు. సబ్సిడీ లభిస్తున్నా పెట్రోల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ ఖరీదైనవిగా ఉన్నాయి.

పర్యావరణాన్ని మేలు చేసే విధంగా ఎలక్ట్రిక్ సహాయపడతాయి. కాలుష్య కారకాలను విడుదల చేసే పెట్రోల్ టూవీలర్స్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకోవడం వల్ల వాతావరణంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మీ వంతుగా సహాయపడవచ్చు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎలక్ట్రిక్ స్కూటర్లను రీసేల్ చేసేటప్పుడు దాని రేటు తగ్గదు. అదే పెట్రోల్ వెహికిల్స్‌ రీసేల్ మార్కెట్‌ ధర కంటే తక్కువకు విక్రయించాల్సి వస్తుంది.

Simple-One-Electric-Scooters

ఏదేమైనా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ, రాబోయే సంవత్సరాలలో వాటి రీసేల్ విలువ పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని వినియోగించడం తేలిక. తక్కువ ఇంధనం మరియు నిర్వహణ ఖర్చుల కారణంగా రీసేల్‌ చేసిన మంచి ధర పలుకుతుంది. ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ వెహికిల్స్‌ మధ్య వత్యాసం ఈ విషయంలో వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉన్న మైనస్‌ ఏంటంటే అవి అందిచే రేంజ్‌ (మైలేజీ) అని చెప్పాలి. అందువల్ల వీటిని కొనుగోలు చేసేందుకు కొంచెం వెనక అడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఛార్జింగ్‌ స్టేషన్లు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల యువత ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. పైన తెలిపిన తేడాల ఆధారంగా మీ అవసరాలకు తగినట్లుగా నచ్చిన మోటార్‌ లేదా ఇంజిన్ ఆప్షన్‌ని ఎన్నుకోండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 22, 2024, 21:20 [IST]
English summary
Electric vs petrol two wheelers which one is best major differences explained
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+