120 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదల.. కేవలం 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌ అవుతుంది!

గత సంవత్సరం నుంచి దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. జనాలు సాంప్రదాయ స్కూటర్ల కంటే వీటిని కొనేందకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్ రేట్లు మండిపోతుండటం వల్ల ఖర్చులను తగ్గించుకునేందుకు జనాలు వీటిని కొంటున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో ఈ విభాగంలో నిలదొక్కుకునేందుకు చాలా కంపెనీలు పాగా వేశాయి. ఇందులో భారీ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేశాయి. రానున్న రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈ రంగంపై స్టార్టప్‌ కంపెనీలు దృష్టి సారించాయి. మార్కెట్‌లో ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు దుమ్మురేపుతున్నాయి. మొత్తం మార్కెట్‌లో ఈ కంపెనీ స్కూటర్లు 27 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఈ స్కూటర్ల బిల్డ్‌ క్వాలిటీపై సందేహాలు నెలకొంటున్నాయి.

ఆ తర్వాత బజాజ్ (Bajaj Chetak Electric Scooters), టీవీఎస్ (TVS Electric), ఏథర్‌ ఎనర్జీ (Ather Energy) స్కూటర్లను ఉన్నాయి. ఇవే కాకుండా చాలా పెద్ద కంపెనీలు కూడా ఈ విభాగంలో రంగంలోకి దిగాయి. అయితే హోండా వంటి ఫేమస్‌ టూవీలర్‌ కంపెనీ మాత్రం ఈ మార్కెట్‌లో ఇంకా అడుగుపెట్టలేదు. ఇది మార్కెట్‌లో ప్రవేశిస్తే సీన్‌ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.

Emobi AKX LS Electric Scooter Launches

ఇక తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఇమోబి (EMobi) మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీ రైడర్స్‌ కోసం AKX LS కమ్యూటర్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్‌ని విడుదల చేసింది. AKX LS మోడల్‌తో, లాస్ట్-మైల్ డెలివరీ ప్రయోజనాల కోసం కొత్త ఎలక్ట్రిక్ వాహనం కోసం చూస్తున్న వారిని కంపెనీ ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని లాంచ్ చేసింది.

ఇక ఈ స్కూటర్‌ విషయానికి వస్తే ఇది పూర్తిగా మేడిన్ ఇండియా (మేడ్-ఇన్-ఇండియా) ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా వస్తోంది. ఈ ఈవీలో ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ యూజ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. కేవలం 30 నిమిషాల్లో రీఛార్జ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ సిస్టమ్ దీని ప్రత్యేకతల్లో ఒకటిగా ఉంది. దీంతో ఈ స్కూటర్‌ని కొనుగోలు చేసిన వారు ఎక్కువ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.

Emobi AKX LS Electric Scooter Price

AKS LS కమ్యూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో జియో ఫెన్సింగ్, లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. కొత్త ఈవీ డెలివరీ చేస్తున్న కార్మికుల సామర్థ్యాన్ని పెంచుతుందని భారతదేశం స్థిరమైన లక్ష్యాలకు దోహదం చేస్తుందని బ్రాండ్ పేర్కొంది. AKX ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇందులోని LFP కెమిస్ట్రీ 1.5 కిలోవాట్, NMC కెమిస్ట్రీ 2.3 కిలోవాట్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

AKX ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం LFP వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇక NMC వేరియంట్ గరిష్టంగా 120 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ ఇమోబి ఫాస్ట్ ఛార్జర్లతో 30 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్‌ ఛార్జ్ ద్వారా కస్టమర్ల టైమ్‌ సేవ్‌ చేయనుంది. రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా లో-స్పీడ్ ఆపరేషన్లలో అధిక సామర్థ్యాన్ని అందించే మోటార్ ఇందులో కస్టమైజబుల్‌గా అందించారు.

Emobi AKX LS Electric Scooter Range

వాహనం తయారీ, పనితీరు నాణ్యతతో లభిస్తుంది. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఇమోబి మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లాస్ట్ మైల్ డెలివరీ కోసం B2B సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. ఈ స్కూటర్‌ హిట్ అయితే మార్కెట్‌లో మరో మంచి బ్రాండ్‌గా అవతరించే అవకాశం ఉంటుంది. దీనిలోని ఫీచర్లు ఆ ఫ్లెక్సిబిలిటీని అందించనున్నాయి. ఈ స్కూటర్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాకే ఫర్ఫామెన్స్‌, ఇతర ఫీచర్లు గురించి తెలిసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 29, 2024, 16:26 [IST]
English summary
Emobi akx ls electric scooter launched check range and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+