ప్రముఖ నటి మనసుదోచిన టయోటా కారు ఇదే!.. ధర ఎంతంటే?

సాధారణ ప్రజల మాదిరిగా కాకుండా.. సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు ఇష్టమైన వాహనాలను కొనుగోలు చేస్తుంటారని గతంలోనే చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ నటి ఇటీవల 'శాంతి మాయాదేవి' టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేసింది.

దృశ్యం వంటి పలు మలయాళీ చిత్రాల్లో నటించిన 'శాంతి మాయాదేవి' (Santhi Mayadevi) ఇటీవల టయోటా కంపెనీకి చెందిన పాపులర్ కారు హైక్రాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇందులో మాయాదేవికి కారును డెలివరీ చేయడం చూడవచ్చు. ఈమెతో పాటు ఆమె భర్త, కూతురు కూడా ఉన్నారు. వీరు కొచ్చిలోని ప్రముఖ టయోటా డీలర్ కైరాలి నుంచి కారును డెలివరీ చేసుకున్నారు.

నటి శాంతి మాయాదేవి కొచ్చిలో నివాసముండటం వల్ల.. కారును అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈమె టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క టాప్ వేరియంట్ జెడ్ఎక్స్ హైబ్రిడ్ వేరియంట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 30.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా ఆన్ రోడ్ ధర రూ. 39.85 లక్షలు. దీనికి సంబంధించిన వీడియోను కూడా నటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

భారతీయ మార్కెట్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి కస్టమర్లు అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్లలో తమకు నచ్చిన కలర్ కారును ఎంచుకోవచ్చు. అంతే కాకుండా ఇది 7 సీటర్ మరియు 8 సీటర్ వేరియంట్లలో లభిస్తోంది. కాబట్టి ఫ్యామిలీ కారుగా కూడా ఇది బాగా ప్రజాదరణ పొందింది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


టయోటా ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ (ఓ) 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 172 Bhp పవర్ మరియు 205 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ ఎంపీవీ యొక్క నాన్ హైబ్రిడ్ వెర్షన్ 16.13 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు 2.0 లీటర్ 4-సిలిండర్ అట్కిన్సన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ కూడా పొందుతుంది.


స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ 172 Bhp పవర్ మరియు 205 న్యూటన్ మీటర్ టార్క్ అందించాలి. ఈ ఇంజిన్ టాప్ వేరియంట్స్ అయిన వీఎక్స్, జెడ్ఎక్స్ మరియు జెడ్ఎక్స్ (ఓ) ట్రిమ్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పనితీరు పరంగా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే డిజైన్ పరంగా దాదాపు అన్నీ సమానంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షనీయంగా ఉంటాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.


సెలబ్రిటీలు కొత్త కార్లను కొనుగోలు చేయడం సర్వ సాధారణం. కొందరు ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తే.. మరి కొందరు స్పోర్ట్స్ కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇంకొందరు రోజు వారీ వినియోగానికి ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ వంటి సరసమైన కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఎవరికి నచ్చిన కార్లను తమకు నచ్చినప్పుడు కొనుగోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.


ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

Source: KairaliToyota/ Instagram

More from DriveSpark

Article Published On: Monday, April 22, 2024, 11:05 [IST]
English summary
Famous actress santhi mayadevi buys new toyota innova hycross
Read more on: #toyota motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+