తొలిసారి జీరో డౌన్‌పేమెంట్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్.. వడ్డీ లేకుండా నెలకు 1400 EMI కడితే చాలు!
దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ iVoomi తన కంపెనీలోని ది బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్కూటర్లపై పండుగ సీజన్‌ని పురస్కరించుకుని రూ.10,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు కస్టమర్లకు స్కూటర్లను తక్కువ ధరలో అందించేందుకు ఫైనాన్సియల్ కంపెనీలతో ప్రత్యేక లోన్ ఆప్షన్‌లను అందిస్తోంది. ఇదివరకు లేని విధంగా కొనుగోలుదారులు ఇప్పుడు ఈ కంపెనీలోని ఎలక్ట్రిక్ స్కూటర్లను చాలా తక్కువ ధరలో ఇంటికి తీసుకెళ్లవచ్చు ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
జీరో డౌన్ పేమెంట్: ఈ కంపెనీ ప్రకటించిన ఆఫర్లలో జీరో డౌన్‌పేమెంట్ ఒకటని చెప్పవచ్చు. ఈ స్కూటర్‌ని కొనడానికి ఎలాంటి డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, లోన్‌పై ఎటువంటి వడ్డీ లేకుండా కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. నెలకు రూ.10 వేలు లేదా రూ.1,411 నుంచే తక్కువ EMI చెల్లించి స్కూటర్లను ఇంటికి తెచ్చుకోవచ్చు.

టాప్ స్కూటర్‌పై ఆఫర్లు: కంపెనీ లైనప్‌లోని జీత్X ZE స్కూటర్ ఫేమస్ స్కూటర్‌గా ఉంది. ఇది అత్యాధునిక సాంకేతికత, మన్నికైన నిర్మాణానికి ప్రసిద్ది చెందనదిగా ఉంది. ఈ హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. డిజైన్, పనితీరు రెండింటినీ కోరుకునేవారికి ఇది మంచి ఆప్షన్‌గా ఉంటుంది.
ఎస్ 1 సిరీస్: స్టైలిష్, పవర్‌ఫుల్ ఎస్ 1 సిరీస్ పై రూ .5,000 తగ్గింపు పొందవచ్చు. ఈ స్కూటర్ స్మూత్ రైడ్, మెరుగైన సౌకర్యంతో వస్తుంది. పండుగ డిస్కౌంట్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలతో తక్కువ ధరకే దీనిని కొనుగోలు చేసేలా మరింత సులభతరం చేసింది. ఈ ఫెస్టివల్ డీల్స్ నవంబర్ మధ్య వరకు అన్ని iVoomi డీలలర్‌షిప్స్‌లో అందుబాటులో ఉంటుదని కంపెనీ పేర్కొంది.

ఇక పైన పేర్కొన్న ఐవూమీ జీత్ ఎక్స్ జెడ్‌ఇ స్కూటర్ మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి రూపొందించబడింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల వరకు టాప్ రేంజ్‌ని అందిస్తుంది. దీని ఐపి 67 బ్యాటరీతో వస్తుంది. దీంతో ఇది దుమ్ము, వాటర్ రెసిస్టన్స్‌గా ఉంటుంది. ఈ స్కూటర్ డైనమిక్ డిజైన్, మంచి ఫీచర్లు, హై ఫర్ఫామెన్స్‌తో రాజీలేని ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది.
మరోవైపు, ఫ్లెక్సిబిలిటీ కోసం అలాగే నగర రైడర్ల కోసం iVoomi ఎస్ 1 సిరీస్ రూపొందించబడింది. ఈ రెండు స్కూటర్లు గ్రీన్ మొబిలిటీ కోసం ప్రత్యేకంగా రూపొందిచబడింది. పండుగ సీజన్‌లో కస్టమర్ల కొనుగోళ్లను మరింత సులభతరం చేసేందుకు ఈ ఆఫర్లు దోహదపడతాయని ఐవోఓఎంఐ సీఈఓ, కో ఫౌండర్ అశ్విన్ భండారీ తెలిపారు. కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఫైనాన్సింగ్ ఆప్షన్లతో సేల్స్ పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








