అందరి ఫేవరెట్ పలర్స్ బైక్స్‌పై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. అలా చేస్తే మరో రూ. 5000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్!
బజాజ్ పల్సర్‌కి (Bajaj Pulsar) మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. టూవీలర్స్‌లోనే ఈ పల్సర్ బైక్స్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ పల్సర్ బైక్స్ 125 సీసీ నుంచి 400 సీసీ మధ్య అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్‌కి ఉన్న ప్రత్యేక డిమాండ్‌ని బట్టి ఈ పండుగ సీజన్‌లో అదిరిపోయే ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. రానున్న దసరా, దీపావళి పండుగ సీజన్‌లో జనాలు ఎక్కువగా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఈ సమయంలో డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తూ అమ్మకాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ పండుగ సీజన్‌లో మార్కెట్‌ని ఒడిసి పట్టుకునేందుకు కంపెనీలు భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా సేల్స్‌ని పొంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే పలు ఆటోమొబైల్ కంపెనీలు ఈ పండుగ ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయి. అదే కోవాలో బజాజ్ ఆటో తన పల్సర్ బైక్స్‌పై అద్భుతమైన ఫెస్టివల్ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఆఫర్ ప్రకారం ఇప్పుడు పల్సర్ బైక్స్ కొనుగోలుపై రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ.5,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

వినియోగదారులు పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్, NS 125, N 150, N 160, NS 200 N 250 పై తక్షణ డిస్కౌంట్ కింద రూ .5,000 తగ్గింపు లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్‌తో పాటు డీలర్‌షిప్ షోరూమ్స్‌లో పైన్ ల్యాబ్స్ మెషీన్స్ (Pine Labs Machines) ద్వారా HDFC క్రెడిట్ కార్డుతో పల్సర్ కొనుగోలు చేస్తే మరో రూ. 5000 తగ్గుతుంది.
అంటే పల్సర్ కొనుగోలుపై మొత్తం రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డులు ఉపయోగించని వినియోగదారులకు, పైన పేర్కొన్న విధంగా పల్సర్ బైక్స్‌పై రూ .5,000 వరకు నగదు తగ్గింపుతో మాత్రమే పొందగలరు. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో పల్సర్ బైక్‌లను కొనుగోలు చేసే వారు ఈ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు అందించే ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు.

కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసిన పల్సర్ బైకులకు 2024 ఒక కీలక మైలురాయిగా నిలిచిందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ శ్రీ సారంగ్ గనాడే తెలిపారు. మా విలువైన కస్టమర్లకు ఈ సూపర్ ఫెస్టివల్ ఆఫర్‌ని ప్రకటించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పల్సర్ బైకులు ఎల్లప్పుడూ ఫర్ఫామెన్స్‌కి అలాగే స్టైలింగ్‌కి పర్యాయపదంగా ఉన్నాయన్నారు. ఇప్పుడు తక్కువ ధరలో మరింత మందికి చేరువ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇక బజాజ్ ఆటో తన మొదటి పల్సర్ మోటార్ సైకిల్‌ని 2001 లో విడుదల చేసింది. తాజాగా కంపెనీ విడుదల చేసిన అప్‌డేటెడ్ 2024 పల్సర్ మోటార్‌సైకిల్స్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, LED హెడ్‌ల్యాంప్స్, నావిగేషన్, USB ఛార్జింగ్ వెంట్స్‌తో డిజిటల్ కన్సోల్‌ని కలిగి ఉంది. ఇంకా అద్భుతమైన డిజైన్‌లో ఎన్ఎస్ బైక్స్‌ని మార్కెట్‌లో కంపెనీ అందిస్తోంది. ప్రస్తుతం బజాజ్ పల్సర్ దేశంలోనే టాప్-10 మోటార్‌సైకిల్స్‌లో ఒకటిగా ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








